Harkirat Singh Bajwa: భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు.. అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు..

|

Dec 16, 2021 | 2:15 PM

అండర్-19 ప్రపంచ కప్ భవిష్యత్ స్టార్ ఆటగాళ్లను గుర్తించే వేదిక.. విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్, జో రూట్ ఇలా దిగ్గజాలు..

Harkirat Singh Bajwa: భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు.. అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు..
Harkirat Singh Bajwa,
Follow us on

అండర్-19 ప్రపంచ కప్ భవిష్యత్ స్టార్ ఆటగాళ్లను గుర్తించే వేదిక.. విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, కేఎల్ రాహుల్, స్టీవ్ స్మిత్, బాబర్ అజామ్, జో రూట్ ఇలా దిగ్గజాలు అండర్-19 ప్రపంచకప్ నుంచే తొలిసారి గుర్తింపు పొందారు. ఆ స్థాయిలో బ్యాటింగ్ చేయడం వల్లే భవిష్యత్ స్టార్ అని ప్రజలు గుర్తించారు. అలాంటి భారత ఆటగాడు వచ్చే నెలలో వెస్టిండీస్‌లో జరగనున్న అండర్-19 ప్రపంచకప్‌లో ఆడనున్నాడు. అయితే అతను భారత తరఫున కాకుండా ఆస్ట్రేలియా తరఫున ఆడనున్నాడు. ఇదేంటి అనుకుంటున్నారా.. ఇయితే ఈ కథ మీరు చదవాల్సిందే..

17 ఏళ్ల హర్కీరత్ సింగ్ బజ్వా మొహాలీలో జన్మించాడు. హర్కీరత్ 7 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని కుటుంబం మెల్బోర్న్‌కు మారింది. హర్కీరత్ తండ్రి బల్జీత్ సింగ్ మెల్‌బోర్న్‌లో టాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కానీ అతని కొడుకు చాలా చిన్న వయస్సులోనే ఆస్ట్రేలియా అంతటా పేరు తెచ్చుకున్న అద్భుతమైన క్రికెటర్ అయ్యాడు. ఓ వార్త సంస్థ కథనం ప్రకారం, హర్కీరత్ సింగ్ 7 సంవత్సరాల వయస్సులో మొహాలీలో వీధి క్రికెట్ ఆడేవాడు. కానీ అతను ఆస్ట్రేలియా చేరుకున్న వెంటనే, అతను చెల్సియా క్రికెట్ క్లబ్‌లో చేరాడు. అక్కడ నుంచి అతని ఆట మొత్తం మారిపోయింది. హర్కీరత్ సింగ్ ఆఫ్ స్పిన్నర్ అతని యాక్షన్ సరిగ్గా హర్భజన్ సింగ్ లాగా ఉంటుంది. హర్కీరత్ సింగ్ ప్రత్యేకత ఏంటంటే.. భజ్జీతో పాటు అశ్విన్‌ని కూడా తన ఆరాధ్యదైవంలా భావిస్తాడు.

ఆస్ట్రేలియా అండర్-19 జట్టులో తన ఎంపికపై, హర్కీరత్ మాట్లాడుతూ ‘నేను అశ్విన్, హర్భజన్ సింగ్ ఇద్దరినీ నా ఆదర్శంగా తీసుకుంటాను. నేను హర్భజన్ బౌలింగ్ చూస్తూ పెరిగాను, కాబట్టి నా యాక్షన్ అతనిని పోలి ఉంటుంది. మెల్‌బోర్న్‌లో క్రికెట్‌లో మెలకువలు నేర్చుకోవడం నా అదృష్టం. ఇక్కడే నాకు అండర్-16 ఆడే అవకాశం కూడా వచ్చింది. తన తండ్రి క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.’అనిహర్కీరత్ సింగ్ చెప్పాడు. ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలన్నది హర్‌కీరత్‌ కల, అతను తనలోని ప్రతిభను సాధించగలడు. హర్కీరత్ కంటే ముందు, తన్వీర్ సంఘా, గురిందర్ సంధు అండర్-19 క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున ఆడారు.

Read Also.. BCCI vs Kohli: బీసీసీఐ షేర్ చేసిన ఫొటోల్లో కనిపించని టెస్ట్ సారథి.. కోహ్లీ ఎక్కడంటూ ఫైరవుతోన్న ఫ్యాన్స్..!