రెట్రో లుక్‌లో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు.. కొన్ని ఫొటోలు గుర్తు పట్టడం కష్టమే భయ్యో..?

Team India Players Retro Looks: సోషల్ మీడియాలో ఇప్పుడు 1980ల నాటి రెట్రో లుక్ ట్రెండ్ సందడి చేస్తోంది. భారత క్రికెటర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఈ ఏఐ ఫొటో ట్రెండ్‌లో భాగమయ్యారు. వైభవ్ సూర్యవంశీ, రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్, అయుష్ మ్హాత్రే, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానేల 80s స్టైల్ ఫొటోలను అభిమానులను ఆకట్టుకున్నాయి.

రెట్రో లుక్‌లో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు.. కొన్ని ఫొటోలు గుర్తు పట్టడం కష్టమే భయ్యో..?
Indian Cricketers 80s Look

Updated on: Sep 10, 2026 | 5:14 PM

Indian Cricketers 80s Look: క్రికెట్ మైదానంలో ఆధునిక స్టైల్‌తో కనిపించే భారత ఆటగాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా 1980s రెట్రో లుక్ (Retro Look)లో దర్శనమిస్తున్నారు. ఏఐ (AI) ఆధారంగా రూపొందిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుత కాలం నాటి క్రికెటర్లను అప్పటి ఫ్యాషన్, హెయిర్‌స్టైల్, దుస్తుల శైలిలో ఊహించడం ఈ ట్రెండ్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది.

వైభవ్–జడేజా జోడీ..

ఈ ట్రెండ్‌లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పేరు కూడా కనిపించింది. రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్ల 80s స్టైల్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో వైభవ్ సూర్యవంశీతో పాటు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) రెట్రో లుక్ కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రియాన్ పరాగ్‌కు సంబంధించిన ఫొటో కూడా అదే ఆల్బమ్‌లో కనిపించింది.

చెన్నై ప్లేయర్లకూ రెట్రో టచ్..

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కూడా ఈ ట్రెండ్‌లో భాగమైంది. యువ ఓపెనర్ ఆయూష్ మాత్రే (Ayush Mhatre)ను 1980ల కాలానికి చెందిన క్రికెటర్‌లా కనిపించేలా రూపొందించిన ఏఐ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కు సంబంధించిన రెట్రో ఫొటోను కూడా ఫ్రాంచైజీ పంచుకుంది.

సూర్య, రహానేల ప్రత్యేక ఫొటోలు..


భారత మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తన భార్య దేవిషా శెట్టితో కలిసి 80s స్టైల్‌లో రూపొందించిన ఫొటోను షేర్ చేశాడు. మరోవైపు అజింక్యా రహానే (Ajinkya Rahane) తన భార్య రాధికా ధోపావ్కర్‌తో కలిసి మూడు వేర్వేరు రెట్రో చిత్రాలను పంచుకున్నాడు. దీంతో క్రికెటర్లకు సంబంధించిన ఈ ఏఐ రెట్రో ట్రెండ్ మరింత ఆసక్తిని రేకెత్తించింది.

సోషల్ మీడియాలో కొత్త ఫ్యాషన్..


క్రికెటర్లు మాత్రమే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా తమ ఆటగాళ్లను 1980ల నాటి లుక్‌లో చూపించే ఫొటోలను రూపొందించి పంచుకుంటున్నాయి. చాట్ జీపీటీ (ChatGPT) లో ప్రస్తుత ఫొటోలను 1980ల శైలిలోకి మార్చే కొత్త ఫీచర్ అందుబాటులోకి రావడంతో ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో విస్తరించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us