AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..!

India vs West Indies 2nd T20I: వెస్టిండీస్‌తో రెండో టీ20కి రంగం సిద్ధమవుతున్న వేళ రాంచీ స్టేడియంలోనే అసలు సందడి మొదలైంది. టీమిండియా యువ బ్యాటర్లు ఈషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్‌లో భారీ షాట్లతో అదరగొట్టారు. ఒకరు సొంత మైదానంలో తన సత్తా చూపిస్తే.. మరొకరు 15 ఏళ్ల వయసులోనే తన బ్యాటింగ్ పవర్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

రాంచీ నెట్స్‌లో ఈషాన్, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే..!
Ishan Kishan And Vaibhav Sooryavanshi
Venkata Chari
|

Updated on: Oct 08, 2026 | 9:33 PM

Share

India vs West Indies 2nd T20I: భారత్ (India), వెస్టిండీస్ (West Indies) మధ్య రెండో టీ20 మ్యాచ్ అక్టోబర్ 9న రాంచీలో జరగనుంది. మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఈషాన్ కిషన్ (Ishan Kishan), వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నెట్స్‌లో ఇద్దరూ భారీ షాట్లు ఆడుతూ బంతిని పదేపదే బౌండరీ లైన్ దాటించారు. ముఖ్యంగా సిక్సర్లతో ఫ్యాన్స్‌ను అలరించారు.

సొంత మైదానంలో ఈషాన్ కిషన్ విధ్వంసం..!

రాంచీ అంటే ఈషాన్ కిషన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. జార్ఖండ్ కెప్టెన్‌గా ఉన్న ఈషాన్‌కు ఈ మైదానం పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. రెండో టీ20కి ముందు నెట్స్‌లోనూ అదే కాన్ఫిడెన్స్ కనిపించింది. ఈషాన్ ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొంటూ తన సహజమైన దూకుడు ఆటను చూపించాడు. రవి బిష్ణోయ్ (Ravi Bishnoi), నామన్ ధీర్ (Naman Dhir), అభిషేక్ శర్మ (Abhishek Sharma) బౌలింగ్‌లో ఈషాన్ భారీ షాట్లు ఆడాడు. బంతిని గ్యాప్‌లోకి పంపడం మాత్రమే కాదు.. అవకాశం దొరికిన ప్రతిసారీ స్టాండ్స్‌లోకి కొట్టే ప్రయత్నం చేశాడు.

ఇదే మైదానంలో ఈషాన్ సంచలన ఇన్నింగ్స్..

రాంచీ మైదానంతో ఈషాన్‌కు ఉన్న అనుబంధానికి మరో బలమైన కారణం కూడా ఉంది. గత ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో హర్యానాపై అతడు కేవలం 49 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: IND vs WI: రాంచీలో శ్రేయస్ సేన సరికొత్త చరిత్రకు సిద్ధం..? ఇప్పటి వరకు ఎవరూ సాధించని రికార్డ్‌పై కన్ను!

ఆ ఇన్నింగ్స్‌లో ఈషాన్ బ్యాటింగ్ జోరుతో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. అదే మైదానంలో మరోసారి బ్యాట్ ఝుళిపించేందుకు ఈషాన్ సిద్ధంగా ఉన్నాడు. వెస్టిండీస్‌పై రెండో టీ20లోనూ ఇలాంటి దూకుడు ఇన్నింగ్స్ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

వైభవ్ సూర్యవంశీ కూడా తగ్గేదేలే..!

ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మరో పెద్ద ఆకర్షణ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ యువ బ్యాటర్ రాంచీ నెట్స్‌లో తన పవర్ హిట్టింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

ప్రాక్టీస్‌ను చూస్తున్న అభిమానులు వైభవ్ బ్యాటింగ్‌పై ప్రత్యేక ఆసక్తి చూపించారు. అతడు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ధాటిగా షాట్లు ఆడాడు. పలు బౌండరీలు బాదడంతో పాటు బంతులను స్టాండ్స్ వైపు, సైట్‌స్క్రీన్ పక్కన ఉన్న ప్రాంతం వైపు పంపించాడు. అతడి షాట్లకు ప్రాక్టీస్ సెషన్‌లోనే మంచి స్పందన కనిపించింది.

అయితే రెండో టీ20లో ఛాన్స్ దక్కుతుందా?

వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ అందరి దృష్టిని ఆకర్షించినా.. రెండో టీ20లో అతడికి అవకాశం రావడం అంత సులభం కాదు. ఓపెనింగ్ కోసం అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (Sanju Samson) జోడీ బరిలోకి దిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే వైభవ్‌కు మ్యాచ్‌లో చోటు దక్కకపోయినా.. ప్రాక్టీస్‌లో చూపించిన బ్యాటింగ్ మాత్రం అతడి ప్రతిభపై మరోసారి చర్చకు తెరతీసింది.

ఎక్కువమంది చదివినది: IND vs WI 2nd T20I: 2వ టీ20 నుంచి అతన్ని పీకేయాల్సిందే.. ఆ టీమిండియా డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ?

ఈ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరం..

రాంచీ ప్రాక్టీస్ సెషన్‌లో శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), అక్షర్ పటేల్ (Axar Patel), కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) పాల్గొనలేదు. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav)కు కూడా విశ్రాంతి ఇచ్చారు.

రాంచీలో రెండో టీ20 ఇంకా మొదలుకాలేదు.. కానీ ఈషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌తో ముందుగానే సందడి మొదలుపెట్టారు. సొంత మైదానంలో ఈషాన్ మరోసారి తనదైన దూకుడు చూపిస్తాడా? 15 ఏళ్ల వైభవ్‌కు మ్యాచ్‌లో అవకాశం రాకపోయినా అతడి ప్రాక్టీస్ ప్రదర్శన మాత్రం భవిష్యత్తుపై ఆసక్తిని పెంచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us