
India vs West Indies 5th T20 highlights in Telugu: భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో విజేత ఎవరో తేల్చే కీలక సమరానికి రంగం సిద్ధమైంది. తొలి నాలుగు మ్యాచ్‌ల అనంతరం సిరీస్ 2–2తో సమంగా ఉండటంతో ఐదో టీ20పై ఆసక్తి పెరిగింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా, వెస్టిండీస్ సిరీస్ ట్రోఫీని దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. టాస్, తుది జట్లు, లైవ్ స్కోర్, వికెట్లు, కీలక మలుపులు సహా మ్యాచ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ను ఇక్కడ తెలుసుకోండి.
భారత్ (India), వెస్టిండీస్ (West Indies) మధ్య బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో (M Chinnaswamy Stadium) జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ను నిలిపివేయాలని అంపైర్లు నిర్ణయించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం వర్షం కారణంగా వెస్టిండీస్ ఇన్నింగ్స్ ప్రారంభం కాలేదు. చివరకు మ్యాచ్‌ను రద్దు చేయడంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు చేతులు కలుపుకున్నారు. బెంగళూరులో చివరి వరకు కొనసాగిన వర్షమే ఈ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది.
7.4 ఓవర్ల తర్వాత వర్షం మరోసారి అడ్డుపడింది. దీంతో మ్యాచ్ ప్రస్తుతం ఆగింది.
7.4 ఓవర్లకు భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
7 ఓవర్లకు భారత జట్టు 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది.
శ్రేయాస్ అయ్యర్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 6.1 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది.
5 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది.
సంజూ శాంసన్ 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత జట్టు 4.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో భారత ఆటగాళ్లు ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. 2026లో అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఏకంగా 70 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదే ఏడాది ఇషాన్ కిషన్ (Ishan Kishan) 55 సిక్సర్లతో మరో భారత బ్యాటర్‌గా టాప్ జాబితాలో నిలిచాడు.
* 2026లో నమోదైన గణాంకాలు.
భారత్ (India) టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో మరో వేగవంతమైన బ్యాటింగ్ ప్రదర్శన నమోదు చేసింది. వెస్టిండీస్ (West Indies)తో బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 2.5 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ అందుకుంది.
భారత్ తరపున టీ20ల్లో వేగంగా వచ్చిన జట్టు అర్ధశతకాల జాబితా ఇదే:
* ప్రస్తుత మ్యాచ్‌లో నమోదైన రికార్డు.
3 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.
ఇషాన్ కేవలం 10 బంతుల్లో 30 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 2.3 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది.
2 ఓవర్లు ముగిసే సరికి భారత జటటు ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది.
పూర్తి సభ్య దేశాల ఆటగాళ్లలో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల తొలి ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా అభిషేక్ శర్మ (Abhishek Sharma) నిలిచాడు.
అభిషేక్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
అభిషేక్ శర్మ 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ తొలి ఓవర్ ముగిసే సరికి 14 పరుగులు చేసింది
టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. భువనేశ్వర్, శివం దుబే వచ్చారు.
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ అందింది. వర్షం తగ్గడంతో మ్యాచ్ ప్రారంభానికి అంపైర్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టాస్ 9 గంటలకు వేయనున్నారు. అలాగే మ్యాచ్‌ను 9.15 గంటలకు ప్రారంభించనున్నారు. ఒక్కో జట్టుకు 9 ఓవర్ల చొప్పున ఆడనున్నాయి. పవర్‌ప్లే 2.4 ఓవర్ల పాటు ఉంటుంది.
7.45 దాటింతే ఓవర్ల కోత మొదలవుతుంది. ఇప్పటి వరకైతే వర్షం ఏమాత్రం తగ్గలేదు. ఇక చివరకు 9.41 గంటలు దాటితే 5 ఓవర్ల మ్యాచ్‌పైనే ఆశలు ఆవిరైపోయినట్లే.
బెంగళూరులో ఇంకా భారీగా వర్షం కురుస్తుండటంతో కొత్తగా చెప్పుకోవడానికి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఐదు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు కటాఫ్ సమయం రాత్రి 9:41 గంటలుగా ఉంది.
చిరుజల్లులు కాస్తా భారీ వర్షంగా మారాయి. భారత జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో విశ్రాంతిగా కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి మ్యాచ్ కోసం వేచి చూడాల్సిందే.
భారత్, వెస్టిండీస్ చివరి మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో టాస్ ఆలస్యం కానుంది. అయితే, చిన్నస్వామిలో డ్రైనేజ్ సిస్టం అద్భుతంగా ఉండడంతో, వర్షం గ్యాప్ ఇస్తే వెంటనే పిచ్‌ను సిద్ధం చేయనున్నారు.
ఈ టీ20పై వరుణుడి ప్రభావం పడితే సిరీస్ విజేతను ఎలా నిర్ణయిస్తారు? మ్యాచ్ పూర్తిగా రద్దయితే ట్రోఫీ ఎవరికి దక్కుతుందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో భారత్ 22 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 12 మ్యాచ్‌లు గెలుచుకుంది, ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ రెండు జట్లు భారతదేశంలో 15 టీ20 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో భారత్ 11, వెస్టిండీస్ 4 గెలుపొందాయి.
15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లోని మొదటి నాలుగు మ్యాచ్‌లలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అభిషేక్ శర్మ, సంజు సామ్సన్, ఇషాన్ కిషన్‌లు టాప్ ఆర్డర్‌లో ఉన్నారు. దీనివల్ల వైభవ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. ఈ నిర్ణయాత్మక మ్యాచ్‌లో జట్టు ఓపెనింగ్ కూర్పును మార్చే అవకాశం లేదు.
ఈ రెండు జట్లు బెంగళూరులో తలపడటం ఇదే మొదటిసారి, అయితే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉంది.
భారత్ 2019 నుంచి స్వదేశంలో టీ20ఐ సిరీస్‌లో ఓడిపోలేదు. మరోవైపు, వెస్టిండీస్ 2002 నుంచి భారత్‌లో ఏ ఫార్మాట్‌లోనూ ద్వైపాక్షిక సిరీస్‌ను గెలవలేదు. భారత్ విజయ పరంపరకు అడ్డుకట్ట వేసే అవకాశం పర్యాటక జట్టుకు ఉంది.
ప్రస్తుతం సిరీస్ 2-2తో సమంగా నిలిచింది. భారత్ తొలి, మూడో మ్యాచ్‌లను గెలుచుకోగా, వెస్టిండీస్ రెండో, నాలుగో టీ20 మ్యాచ్‌లను గెలుచుకుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య ఐదవ, చివరి టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది