మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత టీమ్ తన బ్యాటింగ్ సత్తాను చాటి చెప్పింది. ఓపెనర్లుగా వచ్చిన శుభమాన్ గిల్, రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో పాటు టెయిలెండర్స్ కూడా కొంతమేర రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 9వికెట్ల నష్టానికి 385 పరుగులు చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్ టార్గెట్ 386. ముందుగా టాస్ గెలిచిన కివీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ తన బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను శుభమాన్ గిల్, రోహిత్ శర్మతో ప్రారంభించింది. ఓపెనర్లుగా వచ్చిన గిల్(78 బంతుల్లో 112; 13 ఫోర్లు, 5 సిక్సర్లు).. రోహిత్ (85 బంతుల్లో 101; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) శతకాలతో రాణించారు.
అయితే వీరి ధాటికి భారత్ స్కోర్ ఒక దశలో కేవలం 24.1 ఓవర్లలో 200 మార్కును అందుకుంది. ఈ క్రమంలో భారత్ 450 పైగా పరుగులు చేసేలా కనిపించింది. అయితే వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమయింది. ఈ క్రమంలో కోహ్లీ(35) పర్వాలేదనిపించాడు. ఇక చివర్లో వచ్చిన హార్దిక్ పాండ్యా(54) హాఫ్ సెంచరీతో పరుగులను పెంచాడు. పాండ్యాతో పాటు శార్దూల్ ఠాకూర్ కూడా 25 పరుగులతో స్కోర్ 350 దాటేలా చేశారు. ఆ విధంగా భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది. ఇకపోతే న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, టిక్నర్ చెరో 3 వికెట్లు తీశారు. అలాగే బ్రేస్‌వెల్‌కు ఒక వికెట్ దక్కింది.
Innings Break!
A mighty batting display from #TeamIndia! ? ?
1⃣1⃣2⃣ for @ShubmanGill
1⃣0⃣1⃣ for captain @ImRo45
5⃣4⃣ for vice-captain @hardikpandya7Over to our bowlers now ? ?
Scorecard ▶️ https://t.co/ojTz5RqWZf#INDvNZ | @mastercardindia pic.twitter.com/JW4MXWej4A
— BCCI (@BCCI) January 24, 2023
రోహిత్ శర్మ ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉండడమేకాక ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే భారీ స్కోర్లను చేయడంలో మాత్రం రోహిత్ విఫలం అవుతున్నాడు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ చూస్తే చూడాలని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు రోహిత్ తెర దించాడు. వన్డేల్లో చివరిసారిగా ఎప్పుడో 2020 జనవరి 19న సెంచరీ బాదిన రోహిత్.. మళ్లీ ఆ ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే మూడేళ్ల నిరీక్షణ అనంతరం రోహిత్ మళ్లీ వన్డేల్లో శతకంతో మెరిశాడు. దీంతో అతని అభిమానులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..