ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్, మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. ఇరువైపులా బ్యాటర్లు బౌండరీలతో వీరవిహారం సృష్టించారు. స్కార్చర్స్ నిర్దేశించిన 213 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు మెల్‌బోర్న్ రెనిగెడ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ 35 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ ఆఖర్లో 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయితేనేం రెండు సైడ్స్ కలిపి 414 పరుగుల వరద పారింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు స్టీవ్ ఎస్కినాజీ(54), బాన్‌క్రాఫ్ట్(95 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ రెనిగెడ్స్‌ను విజయం వైపు.. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్(76 నాటౌట్) తీసుకెళ్లాడు. 35 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అంతేకాదు ఏకంగా ఒక ఓవర్‌లో 31 పరుగులు సాధించాడు. అలాగే ఫించ్‌కు జతగా షాన్ మార్ష్(54), విల్ సదర్‌లాండ్(30) మెరుపులు మెరిపించినప్పటికీ.. లక్ష్యానికి 11 పరుగుల దూరంలో మెల్‌బోర్న్ జట్టు నిలిచిపోయింది. ఏదైతేనేం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ మ్యాచ్ రన్ ఫీస్ట్ ఇచ్చింది. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
Run fest at Perth, over 400 plus runs scored. Melbourne Renegades fell 10 runs short, great win for Perth Scorchers as they hold on as table toppers in BBL 12.#BBL12 #CricTracker pic.twitter.com/2ss6uBZcYh
— CricTracker (@Cricketracker) January 22, 2023