AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Afg: అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్‌ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్

Ind vs Afg: అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల ఫిట్‌నెస్‌పై సెప్టెంబర్ 9న స్పష్టత రానుంది. మూడు టీ20లు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి.

Ind vs Afg: అఫ్గానిస్థాన్‌ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్‌ సాధించిన స్టార్ ఆల్‌రౌండర్
Ind Vs Afg
Rakesh
|

Updated on: Sep 08, 2026 | 11:45 AM

Share

Ind vs Afg: అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టుకు పెద్ద ఉపశమనం లభించింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ సాధించి అందుబాటులోకి రాగా, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా లభ్యతపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా తొడకండరాల గాయానికి గురైన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత జింబాబ్వే పర్యటనకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘంగా రిహాబిలిటేషన్ పొందిన ఆయన, ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్య బృందం స్పష్టం చేసింది. అఫ్గానిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సుందర్ తుది జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు. మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ రాణించే సత్తా ఉన్న సుందర్ రాక జట్టుకు కొండంత బలాన్నిచ్చింది.

బుమ్రా రీఎంట్రీ పై సెప్టెంబర్ 9న తుది నిర్ణయం

టీ20 ప్రపంచకప్ ముగిసినప్పటి నుంచి జస్ప్రీత్ బుమ్రా పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే సిరీస్‌లకు దూరంగా ఉన్న ఆయనను అఫ్గాన్ సిరీస్ స్క్వాడ్‌లో చేర్చినప్పటికీ, ఆడటం అనేది ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పైనే ఆధారపడి ఉంది. సెప్టెంబర్ 9న జరగనున్న మ్యాచ్ సిమ్యులేషన్ టెస్టులో బుమ్రా పాల్గొననున్నాడు. ఆ టెస్టులో పాస్ అయితేనే ఆయన బరిలోకి దిగేందుకు అనుమతి లభిస్తుంది. అదే రోజు సాయంత్రానికల్లా బుమ్రా భవిష్యత్తుపై స్పష్టత రానుంది.

నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాల ఫిట్‌నెస్ రిపోర్టులు

భారత జట్టుకు ఎంపికైన తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, యంగ్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఫిట్‌నెస్ టెస్టులు, మ్యాచ్ సిమ్యులేషన్ ప్రక్రియలు పూర్తయ్యాయి. బోర్డు నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది. సెప్టెంబర్ 9 సాయంత్రానికి వీరిద్దరి రిపోర్టులు వెలువడనున్నాయి. మరోవైపు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాల సమస్య నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2026 నుంచి ఆయన గాయాలతో బాధపడుతున్నాడు.

సెప్టెంబర్ 13 నుంచి పొట్టి పోరు రణరంగం

ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టనున్నాడు. సెప్టెంబర్ 13న తొలి టీ20, సెప్టెంబర్ 15న రెండో టీ20, సెప్టెంబర్ 17న మూడో టీ20 జరగనున్నాయి. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శామ్సన్, ఈషాన్ కిషన్ లాంటి అద్భుతమైన యువ రక్తం జట్టులో ఉండటం మ్యాచ్‌లపై తీవ్ర ఆసక్తిని పెంచుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us