IND vs NZ Final Pitch: ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?

IND vs NZ Final Pitch: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కోసం మిక్స్‌డ్ సాయిల్ పిచ్ వాడుతున్నట్లు తెలుస్తోంది. గతసారి జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు టీమిండియాకు అనుకూలైన పిచ్ వాడుతున్నట్లు తెలుస్తోంది.

IND vs NZ Final Pitch: ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
Ind Vs Nz Final

Updated on: Mar 07, 2026 | 7:17 AM

IND vs NZ Final Pitch: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరగనుంది. ఈ ఫైనల్‌కు సంబంధించిన పిచ్ గురించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈసారి మ్యాచ్ మిక్స్‌డ్ సాయిల్ పిచ్ పై జరగనున్నట్లు తెలుస్తోంది.

గత తప్పిదం నుంచి పాఠం..

సుమారు రెండున్నర సంవత్సరాల తర్వాత మరోసారి అహ్మదాబాద్ స్టేడియం ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌కు వేదిక అవుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా (Australia national cricket team) చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్ ఎంపికపై అప్పట్లో భారీ చర్చ జరిగింది. భారత్ మేనేజ్‌మెంట్ కోరిన విధంగా తయారైన పిచ్ చివరికి జట్టుకే ప్రతికూలంగా మారింది. అదే విధంగా ఈ టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఇదే మైదానంలో భారత జట్టు సౌతాఫ్రికా (South Africa national cricket team) చేతిలో ఓటమి చవిచూసింది.

మిక్స్‌డ్ సాయిల్ పిచ్ ప్రత్యేకత..

ఈసారి ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేకంగా రెడ్ సాయిల్ + బ్లాక్ సాయిల్ మిశ్రమంతో పిచ్ సిద్ధం చేసినట్లు సమాచారం. పిచ్‌లో సుమారు 70% రెడ్ సాయిల్, 30% బ్లాక్ సాయిల్ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. రెడ్ సాయిల్ పిచ్‌లో బంతి వేగంగా వస్తుంది. మంచి బౌన్స్ ఉంటుంది. ఇది భారత బ్యాటర్ల ఆటశైలికి అనుకూలంగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ పిచ్ మాత్రం సాధారణంగా నెమ్మదిగా ఉండి బ్యాటింగ్‌ను కష్టతరం చేస్తుంది.

బ్యాట్–బాల్ మధ్య సమతౌల్యం..

మిక్స్‌డ్ పిచ్ వాడటం వల్ల బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతౌల్యం ఉండే అవకాశం ఉంది. దీంతో ఫైనల్ మ్యాచ్‌లో మంచి పోటీ కనిపించే అవకాశముంది.

ఫైనల్‌పై భారీ ఆసక్తి..

భారత్ ఫైనల్‌లో గెలిస్తే వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ సాధించే అవకాశం ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్ తమ తొలి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం పోరాడుతోంది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఫలితం మార్చి 8 సాయంత్రం తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us