మూడో టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లండ్ జట్టు అబుదాబి నుంచి భారత్‌కు తిరిగి వచ్చింది. రెండో టెస్టులో టీమిండియా చేతిలో ఓడిపోయిన ఇంగ్లిష్ జట్టు ప్రాక్టీస్ కోసం అబుదాబి వెళ్లింది. మూడో టెస్టు ప్రారంభమయ్యే సమయం కావడంతో, స్టోక్స్ అండ్ కో భారత్‌లో అడుగుపెట్టింది. మూడు టెస్టుకు వేదికైన రాజ్‌కోట్‌కు తిరిగి వచ్చింది. అక్కడ ఫిబ్రవరి 15 నుండి టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ జరగనుంది. అయితే భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఓ ఇంగ్లండ్ ఆటగాడితో మళ్లీ సమస్య వచ్చి పడింది. వీసాలో సమస్యలు ఉండడంతో విమానాశ్రయం అధికారులు అతనిని అడ్డుకున్నారు. పాకిస్థాన్ మూలాలున్న ఇంగ్లాండ్ ఆటగాడు రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్‌లో విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. అహ్మద్‌కు సింగిల్ ఎంట్రీ వీసా ఉండడమే దీనికి కారణం. దీంతో చాలా సేపు అహ్మద్ ఎయిర్ పోర్టులోనే ఉండిపోయారు. పలు దఫాల చర్చల తర్వాత కానీ రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుతో అహ్మద్‌కు హోటల్‌కు వెళ్లడానికి అనుమతి లభించలేదు. హోట్‌ల్‌కు వెళ్లేందుకు పర్మిషన్ లభించిన ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. నివేదికల ప్రకారం, రాజ్‌కోట్ విమానాశ్రయం నుండి హోటల్‌కు బృందంతో పాటు వెళ్లేందుకు రెహాన్ అహ్మద్ అనుమతి పొందారు. కానీ, 24 గంటల కాలపరిమితితో. వారి పేపర్లను సరిచేసుకోవడానికి ఈ 24 గంటల సమయం ఇచ్చారు. రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభం కావడానికి ముందే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ ఈ పని చేయాల్సి ఉంటుంది.
రెహాన్ వీసాను పునరుద్ధరించాల్సిందిగా ఇంగ్లండ్ జట్టును కోరినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. వారు ఈ పనిని రెండు రోజుల్లో పూర్తి చేయాలి. అప్పటి వరకు, లెగ్ స్పిన్నర్‌కు మిగతా జట్టుతో పాటు భారత్‌లో ఉండటానికి అనుమతి ఉంది. మంగళవారం జరిగే ప్రాక్టీస్‌లో అతను కూడా జట్టులో భాగం కానున్నాడు. భారత పర్యటనలో ఇంగ్లండ్ జట్టు వీసాకు సంబంధించిన సమస్యలు ఎదురుకావడం ఇది రెండోసారి. ఇంతకుముందు షోయబ్ బషీర్ విషయంలో కూడా అలాంటిదే జరిగింది. వీసా పత్రాలు అసంపూర్తిగా ఉండడంతో బషీర్ కూడా తన బృందంతో కలిసి ఇండియాకు రాకపోవడంతో వారం ఆలస్యంగా భారత్ చేరుకున్నాడు. ఈ కారణంగానే అతను హైదరాబాద్‌లో జరిగిన సిరీస్‌లో మొదటి టెస్టులో కాకుండా విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో అరంగేట్రం చేశాడు. ఇక ఇప్పుడు రెహాన్ అహ్మద్ కూడా వీసా సమస్యతో చిక్కుల్లో పడ్డాడు.
Rehan Ahmed, returning from England’s break in Abu Dhabi, found his visa invalid, but was allowed entry and is now staying with the team in Rajkot, with hopes of arranging new paperwork within 24 hours.#RehanAhmed #cricket #cricketupdates #englandworldcup #isportindia pic.twitter.com/bZmWgP4gYr
— isportindia (@isportindia1) February 13, 2024
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫాక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్, మార్క్ వుడ్, ఆలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..