ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు వరుసగా విజయాలు సాధిస్తుండడంతో పోటీ రసవత్తరంగా మారింది. మరోవైపు ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు కూడా తలపడుతున్నాయి. సిరీస్‌లో ఇప్పటికే 2 మ్యాచ్‌లు ముగియగా ఇరు జట్లు ఒక్కో విజయంతో సమంగా నిలిచాయి. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ముఖ్యంగా ఇంగ్లండ్ కంటే భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది.
న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో 66.66 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. 55 విజయాల శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, 52.77 విజయ శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలో రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల జాబితాలో టీమిండియా ఆస్ట్రేలియాను అధిగమించే అవకాశం ఉంది. అదే సమయంలో పాయింట్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటుంది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మూడో ఎడిషన్‌లో టీమిండియా ఇప్పటి వరకు 6 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ 6 మ్యాచ్‌ల్లో టీమిండియా 3 మ్యాచ్‌లు గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అదే సమయంలో, ఒక మ్యాచ్ డ్రాతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. తద్వారా మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళుతుంది. న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఓడిపోయి, రాజ్‌కోట్ మ్యాచ్‌లో భారత్ జట్టు గెలిస్తే పాయింట్ల పట్టికలో కూడా భారత్ అగ్రస్థానంలో నిలవవచ్చు.
Experience of Indian batters in the 3rd Test vs England:
Rohit – 56 Tests.
Jaiswal – 6 Tests.
Gill – 22 Tests.
Patidar – 1 Test.
Bharat – 7 Tests.
Sarfaraz – Yet to make the debut.
Padikkal – Yet to make the debut.
Jurel – Yet to make the debut. pic.twitter.com/lcx0HXc0Nw— Johns. (@CricCrazyJohns) February 12, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..