Video: టీమిండియా వికెట్ల కోసం బెయిల్స్ మార్చిన స్టార్క్.. కట్‌చేస్తే.. బిగ్ షాకిచ్చిన జైస్వాల్..

|

Dec 30, 2024 | 11:23 AM

Yashasvi Jaiswal-Mitchell Starc's Bails Change Video: 4వ టెస్ట్‌ను డ్రా చేసుకునేందుకు భారత ఆటగాళ్లు ప్రయత్నిస్తుండగా.. విజయం కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్రంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో జైస్వాల్, మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సిరాజ్ ప్లే చేసిన ట్రిక్ ఉపయోగించిన స్టార్క్.. జైస్వాల్ కనిపెట్టడంతో విఫలమైంది. దీంతో ఈ వీడియో తెగ వైరలవుతోంది.

Video: టీమిండియా వికెట్ల కోసం బెయిల్స్ మార్చిన స్టార్క్.. కట్‌చేస్తే.. బిగ్ షాకిచ్చిన జైస్వాల్..
Yashasvi Jaiswals Epic Reply Mitchell Starc
Follow us on

Yashasvi Jaiswal-Mitchell Starc’s Bails Change Video: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్‌లో బేల్స్ మార్పులాట కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 340 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కలిసి వచ్చిన యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీమ్ ఇండియా బ్యాటర్లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో, ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ బెయిల్స్ ట్రిక్ కోసం ప్రయత్నించాడు.

ఇన్నింగ్స్ 33వ ఓవర్ 3వ బంతికి ముందు, మిచెల్ స్టార్క్ బేల్స్‌ను మార్పేశాడు. ఇది గమనించిన నాన్‌స్ట్రైక్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ వెంటనే బెయిల్‌లను యథావిధిగా ఉంచాడు. దీంతో ఆస్ట్రేలియా బేల్స్ ట్రిక్‌కు బ్రేక్‌లు వేశాడు.

ఇవి కూడా చదవండి

బేల్స్ ఎందుకు మార్చుతున్నారు?

ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ టెస్టు క్రికెట్‌లో బెయిల్స్ ట్రిక్‌ను ఉపయోగించాడు. ప్రత్యర్థి జట్టు వికెట్ పడనప్పుడు, బ్రాడ్ అందుకు బదులుగా బెయిల్స్ మార్చుతుంటాడు.

విశేషమేమిటంటే.. అలాంటి ట్రిక్ ఉపయోగించి బ్రాడ్ చాలాసార్లు వికెట్ తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ దీన్ని ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మార్నస్ లాబుస్చాగ్నే అవుట్ అయ్యాడు.

ఇప్పుడు, మిచెల్ స్టార్క్ టీమిండియా బ్యాటర్ల వికెట్ పడగొట్టడానికి బాల్ ట్రిక్‌ను ప్రయత్నించాడు. ఇది గమనించిన జైస్వాల్ మరలా ఆ బెయిల్స్‌ను యథావిధిగా ఉంచేశాడు. దీంతో ఈ బేల్స్ మార్పు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..