Yashasvi Jaiswal Out Controversy: మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాల్గవ టెస్టు ఐదో రోజు ఆటలో యశస్వి జైస్వాల్ ఔట్ వివాదాస్పదంగా మారింది. విజయం కోసం ఆస్ట్రేలియా, డ్రా కోసం భారత ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న తరుణంలో జైస్వాల్ 84 పరుగుల వద్ద ఓ షాకింగ్ నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. దీంతో ఇదెలా ఔట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కుస్తోంది. అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు డీఆర్‌ఎస్ తీసుకున్నారు. ఈ క్రమంలో థర్డ్ అంపైర్ అన్ని యాంగిల్స్ చూసినా ఏం అర్థం కాలేదు. చివరకు స్నికో తీసుకున్నా అందులో ఎటువంటి స్పైక్ రాలేదు. కానీ, చివరకు థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడంలో, మరోసారి ఈ నిర్ణయం వివాదస్పదంగా మారింది.
స్నికో మీటర్‌పై ఎటువంటి కాంటాక్ట్ లేకపోయినా టీమిండియా బ్యాటర్‌ను అవుట్ చేయడంతో వివాదం మొదలైంది. 84 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న ఈ ఎడమచేతి వాటం ఆటగాడు పాట్ కమ్మిన్స్ సంధించిన షార్ట్ పిచ్డ్ డెలివరీని కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ, అతని హుక్ షాట్ సక్సెస్ కాలేదు. దీంతో ఆస్ట్రేలియా డీఆర్‌ఎస్ తీసుకుంది. అయితే ఆన్-ఫీల్డ్ అంపైర్ జోయెల్ విల్సన్ దానిని తిరస్కరించాడు.
Was the decision to give 𝐘𝐚𝐬𝐡𝐚𝐬𝐯𝐢 𝐉𝐚𝐢𝐬𝐰𝐚𝐥 out right or wrong?#INDvsAUS #Jaiswal #INDvsAUSTest #BGT24 pic.twitter.com/wQOvn19hdy
— Devilal Bangra (@devilalbangra3) December 30, 2024
ఆస్ట్రేలియా తీసుకున్న రివ్యూలో మాత్రం ఫలితం వేరేలా వచ్చింది. రీప్లేలు స్పష్టంగా నాటౌట్‌గానూ చూపించాయి. బంతి బ్యాట్‌ను దాటినప్పుడు స్నికో మీటర్ స్పైక్‌ను చూపలేదు. కానీ, థర్డ్ అంపైర్, బంతి బ్యాట్‌ను దాటినప్పుడు స్పష్టమైన కాంటాక్ట్ ఉందని, అందువల్ల తన నిర్ణయాన్ని మార్చుకోమని మైదానంలోని అంపైర్‌ని కోరాడు. దీంతో జైస్వాల్ అసహనంగా పెవిలియన్ చేరాడు. దీంతో మరోసారి థర్డ్ అంపైర్ నిర్ణయంపై వివాదం నెలకొంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..