వరల్డ్‌కప్‌లో తాహిర్ అరుదైన రికార్డు..!

|

May 30, 2019 | 4:39 PM

ప్రపంచకప్‌లో సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌లో మొదటి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇవాళ మొదలైన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ అనూహ్యంగా మొదటి ఓవర్ స్పిన్నర్ తాహిర్‌తో వేయించాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న తాహిర్.. తన రెండో బంతికే బెయిర్‌స్టో‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఇక గత నాలుగు ప్రపంచకప్‌లు పరిశీలిస్తే.. 2003లో షాన్‌ […]

వరల్డ్‌కప్‌లో తాహిర్ అరుదైన రికార్డు..!
Follow us on

ప్రపంచకప్‌లో సఫారీ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన ఘనత సాధించాడు. వరల్డ్‌కప్‌లో మొదటి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇవాళ మొదలైన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ అనూహ్యంగా మొదటి ఓవర్ స్పిన్నర్ తాహిర్‌తో వేయించాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న తాహిర్.. తన రెండో బంతికే బెయిర్‌స్టో‌ను పెవిలియన్‌కు పంపించాడు.

ఇక గత నాలుగు ప్రపంచకప్‌లు పరిశీలిస్తే.. 2003లో షాన్‌ పొలాక్‌, 2007లో ఉమర్‌ గుల్‌, 2011లో షఫీఉల్‌ ఇస్లామ్‌, 2015లో నువాన్‌ కులశేఖరలు తమ మొదటి ఓవర్‌‌ను వేశారు.