‘మై 11 సర్కిల్’ యాప్‌లో భాగస్వామ్యులై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఓడిస్తే కోటి రూపాయల నజరానా పొందవచ్చునని సంబంధిత ప్రతినిధులు ప్రకటించారు. మై 11 సర్కిల్ యాప్ ద్వారా ప్రతి వరల్డ్‌క్‌పలోనూ ఛాలెంజింగ్ అభిప్రాయ సేకరణ జరుగుతోంది. మై 11 సర్కిల్‌లో పాల్గొనే క్రికెట్ అభిమానుల కోసం ‘దాదా కా వాదా’ పేరుతో నిర్వహిస్తున్నారు. ‘అభిమానులతో కలసి ఆడతాను.. వారు ఉత్సాహం పొందుతారని ఎవరు నా బృందాన్ని ఓడిస్తారో వారు ఐదు రెట్ల నగదు పొందుతారని… ఒకవేళ టోర్నీని కైవశం చేసుకుంటే కోటి రూపాయలు మీ సొంతమని’ గంగూలీ ఓ సందేశం ఇచ్చారు. గంగూలీ క్రికెట్ ఫాంటసీ వేదిక మై 11 సర్కిల్‌కు రాయబారిగా ఉన్నారు.