లెజెండరీ ఇండియన్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో ఇక సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. వరల్డ్ కప్ లో కామెంటేటర్ గా ఆయన తొలిసారి రంగప్రవేశం చేయనున్నాడు. గురువారం లండన్ లోని ఓవల్ లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య జరిగే పోటీకి వ్యాఖ్యాతగా ..కామెంటరీ బాక్స్ లో దర్శనమివ్వబోతున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆ రోజున మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు జరగనున్న హిందీ-ఇంగ్లిష్ ప్రీ-షో లో సచిన్ ని మనం చూడవచ్చు. సచిన్ ఓపెన్స్ ఎగైన్ అన్న తన సొంత స్లోగన్ కి అనుగుణంగా ఆయన కామెంటేటర్ గా అందర్నీ ఆకట్టుకోవడానికి సిధ్ధపడుతున్నాడు. తాను వరల్డ్ కప్ ఆడిన ఆరు ‘ ఘట్టాల్లో ‘ సచిన్ 2,278 పరుగులు చేశాడు. ఇంకా అన్ని ఇంటనేషనల్ మ్యాచుల్లో 30 వేల రన్స్ సాధించిన క్రెడిట్ ఆయన సొంతం.. ఇంకా ఈ క్రికెట్ దిగ్గజం సాధించిన విజయాలు ఇన్నీ అన్నీ కావు. అన్నీ అతని కెరీర్ లో ఘనమైన మైలు రాళ్లే !