ధోని, కోహ్లిలకు ‘వరల్డ్‌కప్’ కత్తి మీద సాము..!

|

May 29, 2019 | 5:27 PM

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారత్ క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇండియా వరుస విజయాలతో దూసుకుపోయింది. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలి ప్రణాళికలతో జట్టును విజయ తీరాలకు చేర్పించడంలో కీలక పాత్ర పోషించాడు ధోని. మెగా టోర్నమెంట్స్ అన్నింటిల్లో కూడా భారత్ హవా కొనసాగింది. 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. ఆ తర్వాత ధోని నాయకత్వంలో 2011లో రెండోసారి ప్రపంచకప్ చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, బోర్డర్-గవాస్కర్ […]

ధోని, కోహ్లిలకు వరల్డ్‌కప్ కత్తి మీద సాము..!
Follow us on

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారత్ క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇండియా వరుస విజయాలతో దూసుకుపోయింది. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలి ప్రణాళికలతో జట్టును విజయ తీరాలకు చేర్పించడంలో కీలక పాత్ర పోషించాడు ధోని. మెగా టోర్నమెంట్స్ అన్నింటిల్లో కూడా భారత్ హవా కొనసాగింది. 1983లో కపిల్ దేవ్ సారధ్యంలో ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. ఆ తర్వాత ధోని నాయకత్వంలో 2011లో రెండోసారి ప్రపంచకప్ చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్.. ఇలా పలు మెగా టోర్నమెంట్ టైటిల్స్‌ను భారత్ ఖాతాలో చేర్చాడు ధోని. ఇక 2009లో మొదటిసారి భారత్‌ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానానికి తీసుకువెళ్ళాడు. 2013 లో అతని సారథ్యంలో, భారతదేశం 40 సంవత్సరాల తరవాత ఒక టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది. కాగా అతడు 2014 డిసెంబర్ 30న టెస్టుల్లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. అటు వన్డేలలో కూడా పలు అద్భుతమైన రికార్డ్స్ భారత్‌కు సొంతం చేశాడు ధోని.. ఇక అతడి తర్వాత భారత్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి పగ్గాలు చేపట్టాడు.

దూకుడుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విరాట్ కోహ్లీ.. తనదైన శైలి ఆటతీరుతో భారత్‌కు ఇప్పటివరకు అనేక విజయాలు అందించాడు. ఇప్పుడు తనముందున్న ఒకే లక్ష్యం ప్రపంచకప్. తన ఆట తీరు ప్రభంజనంతో ధోని చేయూతగా ప్రపంచకప్‌నుసాధించాలనే పట్టుదలతో ఉన్నాడు.

టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భారత్‌కు ప్రధాన బలం…

భారత్‌కు టాప్ ఆర్డర్‌లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నారు.. వీళ్ళ ముగ్గురు చెలరేగితే భారీ స్కోర్ ఏదైనా చిన్నది అయిపోతుంది. ఇక మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞుడు ధోని ఎలానూ ఉన్నాడు. అటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కూడా సూపర్ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక బౌలర్లు విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలు రీసెంట్‌గా జరిగిన వార్మప్ మ్యాచ్‌లలో చక్కటి ప్రదర్శన కనబరిచారు. అటు స్పిన్ విభాగం కూడా కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజాతో పటిష్టంగా ఉంది.

ఆ స్థానమే భారత్‌కు ప్రధమ బలహీనత…

ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఆస్థాయి మేటి బాట్స్‌మెన్ ఎవరూ కూడా 4వ స్థానంలో ఆడడానికి ఇప్పటివరకు భారత్‌కు దొరకలేదు. 2011 ప్రపంచకప్ సమయంలో యూవీ 4వ స్థానంలో అద్భుతంగా రాణించి.. భారత్ ప్రపంచకప్ దక్కించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఇక అలాంటి ఆటగాడు ఇప్పటివరకు భారత్‌కు దొరకలేదని చెప్పాలి. గతంలో అంబటి రాయుడిని ఈ స్థానంలో ప్రయత్నించినా.. సరైన ప్రయోజనం లేకపోయింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, విజయ్ శంకర్ కూడా విఫలమయ్యారు. అయితే నిన్న జరిగిన వార్మప్ మ్యాచ్‌లో రాహుల్ 4వ స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేయడంతో భారత్ శిబరంలో ఆశలు చిగురించాయి. ఇలానే ప్రపంచకప్‌లో కూడా రాహుల్ చక్కటి ఫామ్ కనబరిస్తే.. ప్రపంచకప్ సొంతం చేసుకోవడం భారత్‌కు సులభం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైనా విరాట్ కోహ్లీ, ధోనికి ఈ ప్రపంచకప్ కత్తి మీద సామనే చెప్పాలి.