గాయంతో తొలి మ్యాచ్‌కు స్టెయిన్ దూరం..!

|

May 29, 2019 | 3:42 PM

రేపే ప్రపంచకప్ మొదలు కానుంది. మొదటి మ్యాచ్ ఓవల్ వేదికగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆరంభ మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. భుజం గాయంతో బాధపడుతున్న స్టెయిన్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని… ‘ఆదివారం (బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌) నాటికి కాకపోయినా.. భారత్‌తో జరగబోయే మ్యాచ్‌ (జూన్‌ 5) సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని’ దక్షిణాఫ్రికా కోచ్‌ గిబ్సన్‌ […]

గాయంతో తొలి మ్యాచ్‌కు స్టెయిన్ దూరం..!
Follow us on

రేపే ప్రపంచకప్ మొదలు కానుంది. మొదటి మ్యాచ్ ఓవల్ వేదికగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనుంది. ఇక ఈ మ్యాచ్ ఆరంభానికి ముందే సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఆరంభ మ్యాచ్‌‌లకు దూరమయ్యాడు. భుజం గాయంతో బాధపడుతున్న స్టెయిన్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని… ‘ఆదివారం (బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌) నాటికి కాకపోయినా.. భారత్‌తో జరగబోయే మ్యాచ్‌ (జూన్‌ 5) సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని’ దక్షిణాఫ్రికా కోచ్‌ గిబ్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.