ప్రస్తుత ప్రపంచకప్ లో మరో హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తానని శ్రీలంక పేసర్ లసిత్ మలింగ పేర్కొన్నాడు. 2007 ప్రపంచకప్ లో సఫరీలతో జరిగిన మ్యాచ్ లో నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీశాడు మలింగ. ‘ఈ ప్రపంచకప్ లో కూడా మరోసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తానని.. హ్యాట్రిక్ తనకెంతో ప్రత్యేకం అని అన్నాడు. ఐపీఎల్‌లో మరోసారి విజయవంతమవడం ఆనందంగా ఉంది. ప్రపంచ కప్‌కు ముందు నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంగ్లాండ్‌లో పరిస్థితులకు అలవాటు పడటం ముఖ్యం. అప్పుడప్పుడూ ఎండ.. కొన్నిసార్లు చలి ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితులు బౌలర్ల నైపుణ్యానికి పరీక్ష పెడతాయని మలింగ చెప్పాడు.