ఐసీసీ వరల్డ్ కప్ 2019: ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ షాక్

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసకర ఆటగాడు/వికెట్ కీపర్ మహ్మద్ షాజాద్ (32) టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడినప్పటికీ ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో ఆడాడు. దీంతో మోకాలి గాయం తీవ్రత మరింత పెరిగి టోర్నీ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా ఉన్న షాజాద్ నిష్క్రమణ ఆఫ్ఘాన్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని చెబుతున్నారు. 2015 ప్రపంచకప్ నుంచి […]

ఐసీసీ వరల్డ్ కప్ 2019: ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ షాక్
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 6:33 PM

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసకర ఆటగాడు/వికెట్ కీపర్ మహ్మద్ షాజాద్ (32) టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడినప్పటికీ ఆస్ట్రేలియా, శ్రీలంకతో జరిగిన మ్యాచుల్లో ఆడాడు. దీంతో మోకాలి గాయం తీవ్రత మరింత పెరిగి టోర్నీ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్‌లో కీలక ఆటగాడిగా ఉన్న షాజాద్ నిష్క్రమణ ఆఫ్ఘాన్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని చెబుతున్నారు.

2015 ప్రపంచకప్ నుంచి ఆఫ్ఘాన్ జట్టులో ప్రధాన ఆటగాడిగా ఉన్న షాజాద్ ఆ జట్టు తరపున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మొత్తం 55 మ్యాచుల్లో 1843 పరుగులు చేశాడు. టోర్నీ నుంచి దూరమైన షాజాద్ స్థానంలో 18 ఏళ్ల టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఇక్రమ్ అలీ ఖిల్‌కు జట్టులో చోటు కల్పించారు.