
Ian Smith Warns New Zealand Ahead of 3rd T20 vs IND: సొంత గడ్డపై పులిలా విజృంభించే న్యూజిలాండ్ జట్టు, ప్రస్తుతం సొంత ఇంట్లోనే విపరీతమైన చెమటలు పడుతోంది. ఏ జట్టుకైనా సొంత అభిమానుల ముందు వరుసగా మ్యాచ్‌లు కోల్పోవడం ప్రాణం పోయినంత పని అవుతుంది. అందులోనూ టీమిండియా కుర్రాళ్లు చూపిస్తున్న తెగువ, కనబరుస్తున్న ఆధిపత్యం చూస్తూ ఉంటే కివీస్ శిబిరంలో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పరిస్థితులు, పిచ్‌లు ఎలా ఉన్నా భారత యువ ఆటగాళ్లు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా కివీస్ బౌలర్ల వ్యూహాలను తుత్తినీయులు చేస్తున్నారు. మొదటి రెండు టీ20లలో టీమిండియా సాధించిన సంచలన విజయాలు న్యూజిలాండ్‌కు చెప్పలేనంత టెన్షన్‌ను గురిచేస్తున్నాయి.
ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో, రెండో టీ20లో మన కుర్రాళ్ల వీరోచిత పోరాటాన్ని చూసి షాక్ అయిన న్యూజిలాండ్ మాజీ దిగ్గజం ఇయాన్ స్మిత్, మూడో టీ20కి ముందు కివీస్‌ను హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌లో సాధారణంగా ఏ జట్లలో అయినా ఒకరో ఇద్దరో మ్యాచ్ విన్నర్స్ ఉంటారు. వాళ్లను ఏదోలా కట్టడి చేస్తే మ్యాచ్ మన చేతుల్లోకి వస్తుందని బౌలర్లు ఒక పక్కా ప్లాన్ వేసుకోవచ్చు. కానీ, ఈ ఇండియన్ టీం పరిస్థితి పూర్తిగా వేరని స్మిత్ స్పష్టం చేశారు. ఇక్కడ జట్టు అంతా మ్యాచ్ విన్నర్లతోనే నిండిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “ఒకడిని అవుట్ చేసి దొరికాడురా బాబు అని ఊపిరి పీల్చుకునేలోపే ఇంకొకడు ఉప్పెనలా దూసుకొస్తున్నాడు. ఒకరిని అంటే వ్యూహాలు పన్ని ఆపగలం కానీ, ఇలా క్రీజ్‌లోకి వస్తున్న ప్రతీ వాడిని ఆపే శక్తి మా వాళ్లకు ఉందా అని తీవ్రమైన అనుమానం నాకు ఇప్పుడు కలుగుతోంది” అని స్మిత్ తన ఆవేదనను వెలిబుచ్చారు.
ఎక్కువమంది చదివినది: Tilak Varma: టీ20ల్లో కోహ్లీ వారసుడు ఇతనే.. ఛేజింగ్ అంటే చిర్రెత్తిపోతున్నాడుగా..!
మొదటి మ్యాచ్‌లో సంజూ శాంసన్, నమన్ ధీర్ ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుత ప్రదర్శన కనబరిచారు. రెండో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయినప్పటికీ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలు కివీస్ పాలిట సింహస్వప్నంగా మారిపోయి ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. వాళ్లకు తోడుగా మళ్లీ ఆ నమన్ ధీర్ తన కౌంటర్ అటాక్‌తో కొరకరాని కొయ్యలా మారాడు. అసలు వాళ్ల బ్యాటింగ్ ఆర్డర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అంటే, ఎవరైనా ఒకరు ఫెయిల్ అయినా ఆ స్థానంలో ఇంకొకరు ఎటువంటి బెరుకు లేకుండా బాధ్యత తీసుకుంటున్నారు. నిజానికి ఆ రెండో మ్యాచ్‌లో కివీస్ బౌలర్లు ఇంకొక్క వికెట్ తీసుంటే మ్యాచ్ స్వరూపం మొత్తం తారుమారు అయ్యేది. కానీ, అలాంటి విపరీతమైన ఒత్తిడిలో కూడా భారత బ్యాటింగ్ ఏ మాత్రం తడబడలేదు. వికెట్లు పడుతున్నా కివీస్ బౌలర్లను వాళ్ళు ఎదురుదాడి చేసిన తీరు అమోఘం. ఒత్తిడి లేకుండా ఆడుతున్న వాళ్ల దూకుడు చూస్తూ ఉంటే, మా వాళ్ళ బౌలింగ్ అస్త్రాలన్నీ బోసిపోయినట్లు కనిపిస్తున్నాయని ఇయాన్ స్మిత్ వ్యాఖ్యానించారు.
ఎక్కువమంది చదివినది: IND vs NZ: కివీస్‌తో వన్డే సిరీస్.. బుల్లెట్ షాట్లతో కోహ్లీ లోడింగ్.. రోకో జోడీ బయల్దేరేది ఎప్పుడంటే?
ఇదే తీరు గనుక మూడో మ్యాచ్‌లోనూ కొనసాగితే కివీస్‌కు ఈ టీ20 సిరీస్ పూర్తిగా చేజారిపోయినట్లేనని ఆయన కుండబద్దలు కొట్టారు. భారత యువ ఆటగాళ్ల ధాటికి న్యూజిలాండ్ జట్టు కంగారు పడుతుందని, వారిని నిలువరించడం కివీస్ బౌలర్లకు పెద్ద సవాలుగా మారిందని ఇయాన్ స్మిత్ తన అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తమ సొంత గడ్డపై తీవ్రమైన ఆత్మరక్షణలో పడిందని ఆయన హెచ్చరించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..