AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూతురిపై నిర్లక్ష్యం.. గర్ల్ ఫ్రెండ్ పిల్లల కోసం లక్షలు ఖర్చు: షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు

Mohammed Shami: 2014లో వివాహం చేసుకున్న షమీ, హసీన్ జహాన్ 2018 నుంచి విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి హసీన్ జహాన్ షమీపై గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అప్పట్లో బీసీసీఐ (BCCI) కూడా ఈ ఆరోపణలపై విచారణ జరిపి, షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

కూతురిపై నిర్లక్ష్యం.. గర్ల్ ఫ్రెండ్ పిల్లల కోసం లక్షలు ఖర్చు: షమీ మాజీ భార్య సంచలన ఆరోపణలు
Shami Hasin Jahan
Venkata Chari
|

Updated on: Aug 16, 2025 | 7:28 AM

Share

Mohammed Shami Daughter: భారత క్రికెటర్ మహ్మద్ షమీ, అతని మాజీ భార్య హసీన్ జహాన్ మధ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. తమ కూతురు ఐరా చదువును షమీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడని, కానీ తన ప్రియురాలి పిల్లల చదువుల కోసం మాత్రం లక్షలు ఖర్చు చేస్తున్నాడని హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పలు పోస్టులు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హసీన్ జహాన్ ఆరోపణలు..

హసీన్ జహాన్ తన పోస్టుల్లో, “నా కూతురి తండ్రి కోటీశ్వరుడు కానీ, ఓ స్త్రీలోలుడిగా మారిపోయాడు. ఐరా జీవితంతో చెలగాటమాడుతున్నాడు. ప్రియురాలి పిల్లల చదువులకు లక్షలు ఖర్చు చేస్తాడు. కానీ, కన్న కూతురి చదువు విషయానికొచ్చేసరికి డబ్బు లేదని చెబుతున్నాడు,” అని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాకుండా, షమీ తన ప్రియురాలి పిల్లలను ఖరీదైన పాఠశాలల్లో చదివిస్తున్నాడని, వారికి బిజినెస్ క్లాస్ విమాన టికెట్లకు కూడా లక్షలు ఖర్చు చేస్తున్నాడని హసీన్ ఆరోపించింది. అయితే, తన కూతురు ఐరా ఇటీవల ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పాఠశాలలో చేరినట్లు కూడా జహాన్ తెలిపింది. “నా కూతురు మంచి పాఠశాలలో చేరకుండా శత్రువులు ఎన్నో కుట్రలు చేశారు. కానీ దేవుడి దయ వల్ల వాళ్ల పన్నాగాలు విఫలం అయ్యాయి” అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కోర్టు తీర్పు, భరణం..

మహ్మద్ షమీ, హసీన్ జహాన్ మధ్య విడాకుల కేసు, భరణం కేసు ఇంకా నడుస్తున్నాయి. ఇటీవల, కలకత్తా హైకోర్టు షమీకి షాకిస్తూ, హసీన్ జహాన్, ఆమె కూతురు ఐరాకు నెలకు రూ. 4 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఇందులో హసీన్ జహాన్ కోసం నెలకు రూ. 1.5 లక్షలు, కూతురు ఐరా కోసం నెలకు రూ. 2.5 లక్షలు చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే, షమీ సంపాదన, హోదాను బట్టి ఈ భరణం చాలా తక్కువ అని హసీన్ జహాన్ అభిప్రాయపడింది.

గత ఆరోపణలు..

2014లో వివాహం చేసుకున్న షమీ, హసీన్ జహాన్ 2018 నుంచి విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి హసీన్ జహాన్ షమీపై గృహ హింస, మ్యాచ్ ఫిక్సింగ్, ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు వంటి తీవ్రమైన ఆరోపణలు చేసింది. అప్పట్లో బీసీసీఐ (BCCI) కూడా ఈ ఆరోపణలపై విచారణ జరిపి, షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది.

ఈ తాజా ఆరోపణలు షమీ వ్యక్తిగత జీవితాన్ని మరోసారి వార్తల్లో నిలిపాయి. క్రికెట్ కెరీర్‌తో పాటు షమీ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటోంది. ప్రస్తుతం దులీప్ ట్రోఫీ, ఆసియా కప్‌ల కోసం షమీ సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో హసీన్ జహాన్ చేసిన ఈ ఆరోపణలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..