
Hardik Pandya CSK Trade: ఐపీఎల్ (IPL) వర్గాల్లో ఇప్పుడు ఒకే ఒక్క వార్త మార్మోగిపోతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) గూటికి చేరబోతున్నాడనే ప్రచారం సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ బిగ్ ట్రేడ్ డీల్ కోసం ముంబై యాజమాన్యం పెట్టిన షరతులు చూసి సిఎస్‌కే మేనేజ్‌మెంట్ దిగ్భ్రాంతికి గురైనట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాతి నుంచే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడనే వార్తలు జోరందుకున్నాయి. టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్‌ను తమ వైపు తిప్పుకునేందుకు సీఎస్కే తీవ్రంగా యత్నిస్తుండగా, ముంబై ఇండియన్స్ మాత్రం భారీ మూల్యాన్నే ఆశిస్తోంది.
హార్దిక్ పాండ్యాను వదులుకోవాలంటే తమకు చెన్నై నుంచి అటాకింగ్ ఆల్‌రౌండర్ శివం దూబేతో పాటు యంగ్ సెన్సేషన్ ఆయుష్ మ్హత్రేను ట్రేడ్‌లో ఇవ్వాలని ముంబై ప్రతిపాదించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!
భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తున్న యువ ఆటగాడు ఆయుష్ మ్హత్రేను వదులుకోవడానికి సీఎస్కే యాజమాన్యం ఏమాత్రం సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే చెన్నై ఒక సంచలన ప్రత్యమ్నాయ ప్రతిపాదనను ముంబై ముందు ఉంచినట్లు సమాచారం.
శివం దూబేతో పాటు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ దెవాల్డ్ బ్రెవిస్, అదనంగా రూ. 10 కోట్ల నగదు ఇచ్చేందుకు సీఎస్కే మొగ్గు చూపుతోంది. అయితే ముంబై ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
ఇది కూడా చదవండి: Team India: ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే..!
ఒకవేళ ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య ఈ చర్చలు విఫలమైతే, మరో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఈ డీల్‌ను దక్కించుకోవడానికి పొంచి ఉంది.
మరోవైపు ఎంఎస్ ధోనీతో మాట్లాడిన తర్వాత హార్దిక్ పాండ్యా సీఎస్కే తరఫున ఆడటానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, పూర్తి ఆల్ క్యాష్ డీల్ జరుగుతుందా లేక పవర్ ఫుల్ ఆటగాళ్ల మార్పిడితో ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ నమోదవుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..