Video: ఈమె నా భార్య అంటూ పరిచయం.. కట్‌చేస్తే.. మైదానంలో రచ్చ మాములుగా లేదుగా..!

Hardik Pandya Mahieka Sharma kiss: హార్దిక్ పాండ్యా తన కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉండటమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా ఉండటం అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. మరి రాబోయే ఐసీసీ టోర్నీల్లో కూడా హార్దిక్ ఇదే జోరు కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి.

Video: ఈమె నా భార్య అంటూ పరిచయం.. కట్‌చేస్తే.. మైదానంలో రచ్చ మాములుగా లేదుగా..!
Ind Vs Nz Hardik Pandya Calls Mahieka Sharma Wife

Updated on: Mar 09, 2026 | 11:23 AM

Hardik Pandya calls Mahieka Sharma wife: టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న వేళ, సంబరాలు అంబరాన్ని తాకాయి. అయితే ఈ వేడుకల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం హార్దిక్ పాండ్యా, మాహికా శర్మల మధ్య చోటుచేసుకుంది. టీ20 వరల్డ్ కప్ 2026 ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత జతిన్ సప్రూతో జరిగిన ఇంటర్వ్యూలో హార్దిక్ మాహికాను తన ‘భార్య’గా పరిచయం చేశాడు హార్దిక్.

మహికా నా మిసెస్..

ఇంటర్వ్యూ సందర్భంగా హార్దిక్ మాట్లాడుతూ.. “మాహికా నా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి అన్నీ విజయాలే వస్తున్నాయి. ఆమె నా లైఫ్‌లోకి వచ్చాక అంతా మంచే జరుగుతోంది” అని ప్రశంసలు కురిపించాడు. అంతటితో ఆగకుండా మాహికా నిలబడిన వైపు చూపిస్తూ, “ఈమె నా మిసెస్” (భార్య) అని హార్దిక్ పేర్కొన్నాడు. గతంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ, బహిరంగంగా హార్దిక్ ‘మిసెస్’ అని పిలవడం వారి పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్లయింది.

మైదానంలో రొమాంటిక్ క్షణాలు..

హార్దిక్ ఇంటర్వ్యూ ముగించుకుని వచ్చిన తర్వాత మాహికా శర్మ అతనిని గట్టిగా హత్తుకోవడమే కాకుండా, అతని బుగ్గలపై ముద్దు పెట్టుకుని (KISS) అభినందించింది. ఈ రొమాంటిక్ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ముందున్న లక్ష్యం ఏమిటి?

తన భవిష్యత్తు గురించి హార్దిక్ మాట్లాడుతూ.. “నేను ఇంకా మరో 10 ఏళ్ల పాటు క్రికెట్ ఆడతాను. కనీసం మరో 5-6 ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం. 2024 బార్బడోస్ ఫైనల్ తర్వాత నేను ఒకటే నిర్ణయించుకున్నాను.. ఆడే ప్రతి టోర్నీలోనూ ట్రోఫీ గెలవాలి. ఆ మాటను నిజం చేయడానికి నేను కష్టపడుతున్నాను” అని ధీమా వ్యక్తం చేశాడు ఈ టీమిండియా ఆల్ రౌండర్.

టీ20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్ ప్రదర్శన:

ఈ మెగా టోర్నీలో హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.

బ్యాటింగ్: 9 మ్యాచుల్లో 217 పరుగులు.

బౌలింగ్: 9 కీలక వికెట్లు.

భారత్ ఛాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us