
Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో భారత బ్యాట్స్‌మెన్ తమ తుఫాన్ పరుగులను కొనసాగిస్తున్నారు. నాల్గవ రౌండ్‌లో మొత్తం 13 మంది బ్యాట్స్‌మెన్స్ సెంచరీలు సాధించారు. వారిలో ఇద్దరు 150 కంటే ఎక్కువ పరుగులు చేశారు.

విజయ్ హజారే ట్రోఫీ నాల్గవ రౌండ్‌లో సర్ఫరాజ్ ఖాన్ గోవాపై 75 బంతుల్లో 157 పరుగులు చేసి అత్యధిక ఇన్నింగ్స్ ఆడాడు. సిక్కింపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వికల్ప్ తివారీ 112 పరుగులు చేశాడు.

రుతురాజ్ గైక్వాడ్, కృనాల్ పాండ్యా కూడా సెంచరీలు సాధించారు. గైక్వాడ్ ఉత్తరాఖండ్ పై 124 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించగా, కృనాల్ పాండ్యా హైదరాబాద్ పై 63 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. హర్యానా బ్యాట్స్ మెన్ అంకిత్ కుమార్ 123 బంతుల్లో 144 పరుగులు సాధించాడు. జార్ఖండ్ కు చెందిన ఉత్కర్ష్ సింగ్ తమిళనాడు పై 123 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

విజయ్ హజారే ట్రోఫీలో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ప్రదర్శన కొనసాగించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ పుదుచ్చేరిపై 116 బంతుల్లో 113 పరుగులు చేశాడు. ఇది నాలుగు మ్యాచ్‌ల్లో అతని మూడవ సెంచరీ. మయాంక్ అగర్వాల్ కూడా 132 పరుగులు చేశాడు. ఉత్తరప్రదేశ్ బ్యాట్స్‌మన్ ఆర్యన్ జుయల్ అస్సాంపై అజేయంగా 150 పరుగులు చేశాడు.

కేరళ బ్యాట్స్‌మన్ బాబా అపరాజిత్ కూడా రాజస్థాన్‌పై 126 ఇన్నింగ్స్‌తో తన జట్టును విజయపథంలో నడిపించాడు. రాజస్థాన్‌కు చెందిన కరణ్ లాంబా కూడా 119 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మన్ యష్ దుబే త్రిపురపై 105 పరుగులు చేశాడు. గోవా బ్యాట్స్‌మన్ అభినవ్ తేజ్రానా కూడా ముంబైపై సెంచరీ చేశాడు. అస్సాంకు చెందిన సుమిత్ ఘడిగావ్‌కర్ 101 పరుగులు చేశాడు.