Team India: కివీస్‌తో సిరీస్‌కు షమీ దూరం.. కట్‌చేస్తే.. ఫ్యూచర్ పేసర్స్‌కు లక్కీ ఛాన్స్ దక్కినట్లే.. లిస్టులో ముగ్గురు

|

Sep 15, 2024 | 6:04 PM

3 Fast Bowlers Might get Chance For New Zealand Test Series: బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు బిజీగా ఉంది. అయితే, ఈ సమయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సంబంధించిన షాకింగ్ వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం, షమీ పునరాగమనం మరి కాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది.

Team India: కివీస్‌తో సిరీస్‌కు షమీ దూరం.. కట్‌చేస్తే.. ఫ్యూచర్ పేసర్స్‌కు లక్కీ ఛాన్స్ దక్కినట్లే.. లిస్టులో ముగ్గురు
Team India Wtc Final
Follow us on

3 Fast Bowlers Might get ChanceFor New Zealand Test Series: బంగ్లాదేశ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు బిజీగా ఉంది. అయితే, ఈ సమయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనానికి సంబంధించిన షాకింగ్ వార్తలు వస్తున్నాయి. సమాచారం ప్రకారం, షమీ పునరాగమనం మరి కాస్త సమయం పట్టవచ్చని తెలుస్తోంది. అతను అక్టోబర్-నవంబర్లలో న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా దూరంగా ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్‌తో భారత్‌ అక్టోబర్‌ 16 నుంచి టెస్టు సిరీస్‌ను ప్రారంభించాల్సి ఉంది.

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు మహ్మద్ షమీ దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ఉంది. స్వదేశీ సిరీస్‌లో షమీ అంతగా అవసరం లేదు. కానీ, ఆస్ట్రేలియాలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ కారణంగా, షమీ కూడా తన రిటర్న్‌ కోసం హడావిడి పడడంలేదు. అయితే, అతను న్యూజిలాండ్ సిరీస్ ఆడకపోతే, కొంతమంది కొత్త ఫాస్ట్ బౌలర్లకు అవకాశం లభించే అవకాశం ఉంది.

3. హర్షిత్ రాణా..

22 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. అయితే, అతను త్వరలో టీమ్ ఇండియాలో అవకాశం పొందవచ్చు. హర్షిత్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2024లో పాల్గొంటున్నాడు. తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లోయర్ బ్యాట్‌తో కూడా జౌహర్‌ను చూపించగల సత్తా అతని సొంతం. ఈ కారణంగా, మహమ్మద్ షమీ ఔటైన సందర్భంలో హర్షిత్‌కు న్యూజిలాండ్ సిరీస్‌లో అవకాశం లభించవచ్చు.

ఇవి కూడా చదవండి

2. ముఖేష్ కుమార్..

బంగ్లాదేశ్‌తో చెన్నై టెస్టుకు ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ ఎంపిక కాలేదు. ప్లేయింగ్ 11లో అవకాశం రాకపోయినా.. జట్టులో చోటు దక్కించుకోవడంలో సఫలం అవుతాడని అనుకున్నారు. కానీ, అది జరగలేదు. అయితే, మహ్మద్ షమీ న్యూజిలాండ్ సిరీస్ ఆడకపోతే, సెలెక్టర్లు ముఖేష్ వైపు మొగ్గు చూపవచ్చు. అతను ఇంతకుముందు కూడా భారత్ తరపున టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.

1. నవదీప్ సైనీ..

భారత్ తరపున రెండు టెస్టులు ఆడిన నవదీప్ సైనీ.. చాలా కాలంగా టీమ్ ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆ మధ్య ఫిట్‌నెస్ కూడా బాగా లేకపోవడంతో గాయపడ్డాడు. అయితే, ఇప్పుడు అతను తిరిగి ఫిట్‌గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. సైనీ ఎత్తుగా ఉండే ఫాస్ట్ బౌలర్. మంచి పేస్‌తో బౌలింగ్ చేయగలడు. ఈ కారణంగా, మహ్మద్ షమీ లేకపోవడం అతనికి కూడా అవకాశంగా దక్కవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..