Team India Cricketers: లేడీ గెటప్‌లో టీమిండియా ఆటగాళ్లు.. ఫొటోస్ చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..

ఏఐ ఎంట్రీతో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. మరోవైపు నెట్టింట్లో సంచలనాలకు ఏఐ ఓ వేదికలా మారింది. ఈ క్రమంలో ఇటీవలే హిందూ దేవుడు శ్రీరాముడి ఫొటోను ఏఐలో రూపొందించిన సంగతి తెలిసిందే.

Team India Cricketers: లేడీ గెటప్‌లో టీమిండియా ఆటగాళ్లు.. ఫొటోస్ చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే..
Female Version Of Team India Cricketers

Updated on: May 09, 2023 | 5:26 PM

Female Version Of Team India Cricketers: ఏఐ ఎంట్రీతో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొంతమంది ఉద్యోగాలు కోల్పోతుంటే.. మరోవైపు నెట్టింట్లో సంచలనాలకు వేదికవుతోంది. ఈ క్రమంలో ఇటీవలే హిందూ దేవుడు శ్రీరాముడి ఫొటోను ఏఐలో రూపొందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఫొటో నెట్టింట్లో ప్రకంపనలు సృష్టించింది. రాముడి ఫొటోను దేశంలోనే కాదు, ప్రపంచ ప్రజలందరూ విపరీతంగా షేర్ చేశారు. చాలా మంది ఆ ఫోటోను తమ డీపీలో కూడా పెట్టుకున్నారు.

ఇక తాజాగా ఒక కళాకారుడు AI సహాయంతో, దిగ్గజ టీమిండియా క్రికెటర్లను మార్చేశాడు. వీరంతా మహిళలైతే ఎలా ఉంటారో చూపించేశాడు. ఇందులో ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాల ఫొటోలను ఏఐ సహాయంతో ఫిమేల్ వెర్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. వీరితో పాటు శుభమ్ గిల్, హార్దిక్ పాండ్యా, గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఫొటోలను ‘sahixd’ పేరు గల ఖాతాతో షేర్ చేవారు. ఈ ఫొటోలను చూస్తే కచ్చితంగా లవ్‌లో పడిపోతారంటూ నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. అలాగే ఈ ఫొటోలతో పేర్లు కూడా మార్చి షేర్ చేశారు. విరాట్ కోహ్లీ పేరును, విద్యా కోహ్లీగా, శుభ్మన్ గిల్ పేరును, శుభద్ర గిల్ ఇలా మార్చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..