Ashes Series: టెస్టు క్రికెట్‌లో యాషెస్ సిరీస్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరిగే ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. యాషెస్ కోసం ఈ ఏడాది డిసెంబర్‌లో ఇంగ్లండ్ టీం ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అయితే దీనికి ముందు ఒక వార్త క్రికెట్ అభిమానులను నిరాశపరుస్తుంది. ఇంగ్లండ్ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఈ ఏడాది చివరలో యాషెస్ సిరీస్‌ను బహిష్కరించవచ్చంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఎందుకంటే అక్కడ కఠినమైన క్వారంటైన్ నియమాల కారణంగా వారు నాలుగు నెలల పాటు హోటల్ గదులకు పరిమితం కావడం ఇష్టం లేకపోవడమేనని తెలుస్తోంది.
ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ ప్రకారం, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) ఇప్పటికీ తన అగ్రశ్రేణి ఆటగాళ్లను పంపడంలో మొండిగానే ఉందంట. సిరీస్‌ను వాయిదా వేయాలని ఆలోచించడం లేదు. ఇది సీనియర్ ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి కోపం తెప్పించింది.
టీం మొత్తం బహిష్కరించే ఛాన్స్..
“మొత్తం జట్టు పర్యటనను బహిష్కరించడానికి సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేదంటూ” నివేదిక పేర్కొంది. ఇందులో కోచింగ్, సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. ఆటగాళ్లు రెండు వారాల క్వారంటైన్‌ను మాత్రమే కోరకుంటున్నారు. అయితే ఇందులో తమ కుటుంబాలను ఉంచేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో, కొంతమంది ఆటగాళ్లు నాలుగు నెలలు (ఐపీఎల్, ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్, తరువాత యాషెస్ సిరీస్‌లో ఆడతారు) ఈ సమయంలో తమ కుటుంబాన్ని చూడలేరు.
క్వారంటైన్‌తో ఇబ్బంది
క్వారంటైన్‌తో ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. నివేదిక ప్రకారం, “అక్కడ ఉండే రూల్స్ ఆటగాళ్లకు సమస్యగా మారింది. అయితే, క్రీడాకారులు గోల్డ్ కోస్ట్‌లోని హోటల్ రిసార్ట్‌ను ఉపయోగించవచ్చని నివేదికలు ఉన్నాయి. రెండు నుంచి మూడు గంటల పాటు శిక్షణ కోసం బయటకు వెళ్లవచ్చని కూడా నివేదికలు ఉన్నాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలకు సంబంధించిన సమస్యలను నివారించడానికి జట్టు బబుల్‌లో ఉండే అవకాశం కూడా ఉంది. అయితే, కుటుంబ సభ్యులకు కఠినమైన రూల్స్ ఉండడం మాత్రంఇంగ్లండ్ ఆటగాళ్లకు రుచించడం లేదు. వారు 14 రోజులు హోటల్ గదిలకే పరిమితం కావాల్సి ఉంటుంది.