SL vs IND: సుతార్ కాదు.. మా ఓటమికి ఆ ఇద్దరే కారణం.. శ్రీలంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!

Dhananjaya de Silva Comments on SL vs IND 1st Test Mmatch: గాలే టెస్టులో భారత్ 165 పరుగులతో విజయం సాధించినా.. శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా దృష్టిలో మ్యాచ్‌ను మలుపుతిప్పింది మానవ్ సుతార్ బౌలింగ్ ఒక్కటే కాదు. భారత బ్యాటర్లలో ఇద్దరు ఆరంభాలను భారీ స్కోర్లుగా మార్చడం తమపై ఒత్తిడి పెంచిందని మ్యాచ్ తర్వాత ధనంజయ వెల్లడించాడు.

SL vs IND: సుతార్ కాదు.. మా ఓటమికి ఆ ఇద్దరే కారణం.. శ్రీలంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!
Dhananjaya De Silva Comments (1)

Updated on: Aug 19, 2026 | 4:18 PM

Dhananjaya de Silva Comments on SL vs IND 1st Test Mmatch: గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలింది. మానవ్ సుతార్ 6/55తో చెలరేగి మొత్తం 10 వికెట్లు తీసుకున్నా, శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా విజయానికి అసలు తేడా చూపించిన భారత ఆటగాళ్లుగా కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ అంటూ షాకిచ్చాడు. టాస్ గెలిచిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేయడం తమపై ఒత్తిడి పెంచిందని చెప్పుకొచ్చాడు.

రాహుల్, పడిక్కల్ భాగస్వామ్యంతో ఎఫెక్ట్..

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పడిక్కల్ 167, కేఎల్ రాహుల్ 82, ధ్రువ్ జురెల్ 51 పరుగులు చేశారు. పడిక్కల్ భారీ శతకం భారత స్కోరుకు బలమైన పునాది వేసింది. రాహుల్ కూడా మంచి ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మలచడంతో శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి పెరిగిందని ధనంజయ తెలిపాడు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా సహా 8 మందికి గుడ్‌బై..?

చివరి రోజు షాకిచ్చిన సుతార్..

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో సోనల్ దినుషా 100, నిరోషన్ డిక్వెల్లా 80 పరుగులతో పోరాడారు. రెండో ఇన్నింగ్స్‌లో ధనంజయ 59, దినుషా 84 పరుగులతో ప్రతిఘటించారు. వీరిద్దరూ కలిసి 95 పరుగులు జోడించి శ్రీలంకను కొంతసేపు నిలబెట్టారు.

చివరి రోజు మాత్రం భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. రవీంద్ర జడేజా ధనంజయను ఔట్ చేయగా, చివరి ఐదు వికెట్లు కేవలం 50 పరుగుల వ్యవధిలో పడిపోయాయి. సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో 6/55తో అదరగొట్టి తన రెండో టెస్టులోనే తొలి 10 వికెట్ల మ్యాచ్ ఘనత అందుకున్నాడు.

ఎక్కువమంది చదివినది: SL vs IND: లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ ప్యాక్ చేసుకుని ఇంటికెళ్లుడు పక్కా..!

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం పడిక్కల్..

బంతితో సుతార్ అదరగొట్టినా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దేవదత్ పడిక్కల్‌కు దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేశాడు. ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us