
మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే ఈ ప్లేయర్.. అటు ఫినిషర్‌గానూ తన సత్తా చాటాడు. ఓడిపోయిన మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో బాగా తెలుసు. దక్షిణాఫ్రికా T20 లీగ్ 7వ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఓడిపోయే తన జట్టును గెలిపించాడు. గబార్ఖాలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో పార్ల్ రాయల్స్ 2 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. తద్వారా తన జట్టును 5 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఆ ప్లేయర్ మరెవరో కాదు డేవిడ్ మిల్లర్.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ చేసిన 149 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్‌కు 42 బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 35 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్ సులభంగా ఓడిపోతుందని అందరూ భావించారు. కానీ ఆ జట్టు కెప్టెన్ మిల్లర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. వచ్చీరాగానే దూకుడైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. కేవలం 28 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 3 ఫోర్లు బాదాడు. మిల్లర్‌కు తోడుగా మరో ప్లేయర్ కీగన్ లియాన్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కేవలం 68 బంతుల్లో ఐదో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. చివరి ఓవర్‌లో కీగన్ లియాన్ 45 పరుగులకు తన వికెట్ కోల్పోయినప్పటికీ.. మిల్లర్ మాత్రం తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్ గెలుపుతో పార్ల్ రాయల్స్ టోర్నమెంట్‌లో రెండు మ్యాచ్‌లలో ఒకదాన్ని గెలుచుకుంది.
ఇటీవల ఐపీఎల్ వేలంలో డేవిడ్ మిల్లర్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అతడు సుమారు రూ. 5.5 కోట్లు కోల్పోయాడు. గత సీజన్‌లో లక్నో మిల్లర్‌ను రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేయగా.. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కేవలం రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. దీని లెక్క ప్రకారం.. ఐపీఎల్ జీతంలో 73 శాతం తగ్గింది. అయినప్పటికీ, మిల్లర్ తన దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు.
Killer Miller is living up to his name 🔥#Betway #SA20 #SECvPR | @Betway_India pic.twitter.com/64Ge7b0q4W
— Betway SA20 (@SA20_League) January 24, 2023