Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా

Cricket Retirement : క్రికెట్ ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి భారీ టోర్నీలు అభిమానులను అలరించాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పగా, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు.

Cricket Retirement : షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు.. లిస్టులో టీమిండియా కెప్టెన్ కూడా
Cricket Retirement

Updated on: Dec 31, 2025 | 7:09 PM

Cricket Retirement : క్రికెట్ ప్రపంచం మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతోంది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ వంటి భారీ టోర్నీలు అభిమానులను అలరించాయి. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పగా, స్టీవ్ స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అసలైన షాక్ 2026లో ఉండబోతోంది. ఫామ్ లేమి కారణం కావచ్చు లేదా వయస్సు రీత్యా కావచ్చు.. ఐదుగురు స్టార్ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం కనిపిస్తోంది. ఆ లిస్టులో ఉన్న పేర్లు వింటే మీరు షాక్ అవ్వాల్సిందే!

సూర్యకుమార్ యాదవ్ : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఈ లిస్టులో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఆయనే టీమిండియాను నడిపించబోతున్నారు. అయితే, గత 25 మ్యాచుల్లో సూర్య కేవలం 244 పరుగులు మాత్రమే చేయగలిగారు. 2024 బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత ఆయన బ్యాట్ నుంచి ఒక్క హాఫ్ సెంచరీ కూడా రాలేదు. ఈ ఫామ్ లేమి ఇలాగే కొనసాగితే, వరల్డ్ కప్ తర్వాత సూర్య తన కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గ్లెన్ మాక్స్‌వెల్ : ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ఇప్పటికే వన్డేలకు వీడ్కోలు పలికారు. 37 ఏళ్ల వయస్సున్న మాక్స్‌వెల్ 2017 తర్వాత టెస్టులు ఆడలేదు. ప్రస్తుతం కేవలం టీ20ల్లోనే కొనసాగుతున్నారు. 2026 టీ20 వరల్డ్ కప్ ఆయనకు చివరి మెగా టోర్నీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2028 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా యువ జట్టును సిద్ధం చేయాలనుకుంటే, మాక్స్‌వెల్ తప్పుకోవాల్సిందే.

డేవిడ్ మిల్లర్ : దక్షిణాఫ్రికా కిల్లర్ మిల్లర్ 2010 నుంచి జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో తృటిలో కప్పును చేజార్చుకున్న మిల్లర్, ఆ బాధను మర్చిపోలేకపోతున్నారు. 2026లో మరోసారి తన దేశం కోసం వరల్డ్ కప్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ టోర్నీ తర్వాత మిల్లర్ అంతర్జాతీయ క్రికెట్ నుండి నిష్క్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మహ్మద్ నబీ : ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ప్లేయర్ మహ్మద్ నబీ ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీనే తన చివరి వన్డే టోర్నీ అని ప్రకటించారు. ఆ తర్వాత మరో ఏడాది పాటు టీ20లు ఆడతానని చెప్పారు. ఆ లెక్క ప్రకారం చూస్తే 2026 టీ20 వరల్డ్ కప్ వేదికగా నబీ తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకడం ఖాయంగా కనిపిస్తోంది.

అజింక్య రహానే : భారత వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే 2023 జూలై తర్వాత టీమిండియా జెర్సీ ధరించలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో ఆయనకు చోటు దక్కడం అసాధ్యంగా మారింది. అటు టెస్టుల్లో కూడా యువకులకు ప్రాధాన్యం ఇస్తుండటంతో రహానేకు దారులు మూసుకుపోయాయి. దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌కు అధికారికంగా 2026లో వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..