మంగళవారం జరిగిన సన్నాహక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని బౌలర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని 113, కేఎల్ రాహుల్ 108 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా మంగళవారం 95 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. మొదటి సన్నాహక మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భువీ మీడియాతో మాట్లాడుతూ… ‘బ్యాట్స్‌మెన్, బౌలర్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, వారు బాగా రాణించారు. ప్రపంచకప్‌లో బాగా ఆడడానికి ఈ విజయం ఉత్సాహాన్నిస్తుంది’ అని తెలిపాడు.
కాగా… ప్రపంచకప్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఒత్తిడిని ఎలా అధిగమించగలమన్న విషయం ప్రపంచకప్‌లో చాలా ముఖ్యమని భువీ అన్నాడు. ‘ప్రపంచకప్ టోర్నీ చాలా పెద్ద వేదిక. ఒత్తిడి ఉంటుంది.. అయినప్పటికీ, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఇంతకు ముందు కూడా నేను ఇంగ్లండ్‌లో ఆడాను.. ఇక్కడి పరిస్థితులు ఏంటో నాకు తెలుసు’ అని వివరించాడు.