Team India: గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా ఆల్ రౌండర్.. తండ్రి కాబోతున్నానంటూ..

టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన భార్యతో కలిసి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ 30 ఏళ్ల ఆల్ రౌండర్ అక్టోబర్ 7న సోషల్ మీడియాలో తన భార్య మేహా పటేల్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాడనే వార్తను పంచుకున్నారు.

Team India: గుడ్ న్యూస్ చెప్పిన టీమిండియా ఆల్ రౌండర్.. తండ్రి కాబోతున్నానంటూ..
Axar Patel Announces Wife P
Follow us

|

Updated on: Oct 08, 2024 | 5:43 PM

టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన భార్యతో కలిసి ఓ ఫోటోను షేర్ చేశాడు. ఈ 30 ఏళ్ల ఆల్ రౌండర్ అక్టోబర్ 7న సోషల్ మీడియాలో తన భార్య మేహా పటేల్ తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నాడనే వార్తను పంచుకున్నారు. అక్షర్ వీడియోకు “గొప్ప సంతోషం వస్తోంది” అని క్యాప్షన్‌ను జత చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్షర్‌కు అభినందనలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

జనవరి 2023లో వడోదరలో జరిగిన ఒక విలాసవంతమైన వేడుకలో డైటీషియన్ మేహాతో అక్షర్ వివాహం చేసుకున్నాడు. ఇటీవల, కపిల్ శర్మ షోలో కనిపించిన సమయంలో, అక్షర్ తనకు కు కొన్ని ‘శుభవార్తలు’ రావచ్చని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. “అవును, అలా జరగవచ్చు! నా ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకొనే అని నేను ముందే చెప్పాను. ఆమె వైపు ఏదో మంచి జరిగింది కాబట్టి, నేను కూడా కొన్ని శుభవార్తలను పంచుకుంటాను” అని అక్షర్ షోలో చెప్పాడు. యూఎస్, కరేబియన్‌లలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో అక్షర్ అద్భుతంగా ఆడాడు. అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌‌లో రాణించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో అతను భారతదేశం తరపున ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతను 23 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే అతను 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారత్ గెలుపు కీలక ప్రాత పోషించాడు.

అక్షర్ పటేల్ షేర్ చేసిన వీడియో ఇదిగో:

View this post on Instagram

A post shared by Axar Patel (@akshar.patel)