ENG vs AUS: గురువారం అడిలైడ్‌లో పింక్-బాల్ టెస్ట్ ప్రారంభమైంది. అయితే ఆట మొదలైన వెంటనే ఇంగ్లండ్ కీపర్ జోస్ బట్లర్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సిరీస్‌లోని రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. స్టువర్ట్ బ్రాడ్ మొదటి వికెట్ తీసేందుకు ఇంగ్లీష్ వికెట్ కీపర్ అద్భుతమైన డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుని సహాయపడ్డాడు. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ రెండో టెస్టులో తిరిగి జట్టులోకి వచ్చారు. అలాగే ఇంగ్లండ్‌కు మంచి ఆరంభం అందించారు. బ్రాడ్ లెగ్ సైడ్ డౌన్ బౌలింగ్ చేశాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ హారిస్, సులభమైన బౌండరీ కోసం టెంప్టేషన్‌లో, కీపర్, లెగ్ గల్లీని లక్ష్యంగా పెట్టుకుని షాట్‌కు ట్రై చేశాడు. కానీ, షాట్‌లో టైమింగ్ మిస్ అవ్వడంతో బట్లర్ వికెట్ల వెనుక ఎటువంటి పొరపాటు చేయకుండా అద్భుత డైవింగ్‌తో క్యాచ్ అందుకున్నాడు.
అంతకుముందు, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అడిలైడ్ రెస్టారెంట్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుతో సన్నిహితంగా ఉండటంతో రెండో మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. కమిన్స్ గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ సారథ్యవ వహిస్తున్నాడు. 2018లో కేప్‌టౌన్‌లో డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌లతో పాటు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై సస్పెండ్ అయిన తర్వాత ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా స్మిత్‌కి ఇదే మొదటి మ్యాచ్.
ఆస్ట్రేలియా XIలో కమ్మిన్స్ స్థానంలో మైఖేల్ నేజర్ చేరాడు. ఇది ఆతిథ్య జట్టులోని ఏకైక మార్పుగా మిగిలిపోయింది. మరోవైపు ఐదుగురు పేసర్లతో ఇంగ్లండ్ రంగంలోకి దిగింది.
Buttler is exceptional with bat and this time with the gloves ?? also.
????#Ashes https://t.co/0usSodyuEv— Adee Cheema (@AdeeCheema) December 16, 2021
Yes indeed Superman @josbuttler ?? #Snared https://t.co/yKgIbqNhiV
— ShaMraiz (@SuNraYz23) December 16, 2021
That is an awesome catch by Buttler!!Harris is out 3 (28). Broad gets the wicket. #ashes
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) December 16, 2021
Superman Jos Buttler. #ashespic.twitter.com/t0Haq1aggX
— Crickipedia04 (@Crickipedia04) December 16, 2021