12 నెలలు.. 4 ట్రోఫీలు.. ఇది ఆస్ట్రేలియా లెక్క. సాధారణ సిరీస్‌లలో కంటే.. ఐసీసీ ట్రోఫీలలో కంగారూల ఆట వేరేలా ఉంటుంది. ఎన్ని దెబ్బలు తగిలినా.. మళ్లీ మళ్లీ పైకి లేస్తూ.. కప్ కొట్టేస్తుంది. అయితే ఏడాది నుంచి ఆస్ట్రేలియా ఇలా ప్రతీ ఐసీసీ ట్రోఫీని ఎత్తుకెళ్ళిపోతుంటే.. మరోవైపు భారత్ ప్రేక్షకుడి పాత్ర పోషిస్తోంది.. టీమిండియా కల.. కలగానే మిగిలిపోతోంది. గతేడాది ఫిబ్రవరి నుంచి లెక్క మొదలుపెడితే.. 4 ఐసీసీ ట్రోఫీలు ఆస్ట్రేలియా చేజిక్కించుకుంది.. ఇవన్నింటిలోనూ టీమిండియాను దెబ్బ కొడుతూ వచ్చింది.
ద్వైపాక్షిక సిరీస్‌లలో ప్రతీసారి టీమిండియా చేతుల్లో ఓడిపోవడం ఆస్ట్రేలియాకి సర్వసాధారణం.. అయితేనేం మెగా టోర్నమెంట్ వచ్చేసరికి.. ఆసిస్ మనల్ని ఓడించకుండా వెళ్లేది లేదు అంటోంది. గతేడాది ఫిబ్రవరిలో భారత ఉమెన్ జట్టును టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్‌లో ఓడించింది. ఆ తర్వాత మెన్స్ డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్.. అనంతరం వన్డే వరల్డ్‌కప్‌లోనూ టీమిండియాను ఓడించడమే పనిగా పెట్టుకుంది ఆస్ట్రేలియా జట్టు.
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మొదటి సెమీఫైనల్‌లో ఆసీస్ విమెన్స్ జట్టు 5 పరుగుల తేడాతో భారత విమెన్స్ జట్టును మట్టి కరిపించింది. దీంతో కప్పు కల అటకెక్కింది. అలాగే డబ్ల్యూటీసీ ఛాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లోనూ రోహిత్ సేనను ఓడించి.. సీనియర్ల కలను కలగానే మిగిల్చింది. ఇక ఇప్పుడు మరోసారి.. టీమిండియాకు ప్రపంచకప్ దక్కకుండా చేసింది. అయితే ఈసారి అండర్ 19 ప్లేయర్స్ వంతు వచ్చింది. లీగ్ స్టేజిలో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన మన కుర్రాళ్లు.. ఫైనల్‌లో కంగారూలకు తలవంచేశారు. దీంతో మరోసారి భారత అభిమానులు నిరాశ చెందారు.
Medals, smiles and the coveted trophy 🏆🇦🇺#U19WorldCup pic.twitter.com/NPdAGJTLLt
— ICC (@ICC) February 12, 2024
అప్పుడు సీనియర్లు.. ఇప్పుడు జూనియర్లు.. విలన్ ఒక్కరే అది కూడా ఆస్ట్రేలియా.. మనోళ్ళకు ఆస్ట్రేలియా ఫోబియా ఉందా.? లేక ఫైనల్ ఫోబియా ఉందా.. ఎన్నిసార్లు కప్ చేజారుతుందని అనుకుంటూ తలలు పట్టుకున్నారు ఫ్యాన్స్. ద్వైపాక్షిక సిరీస్‌లలో రాణిస్తే సరిపోదు.. ఐసీసీ టోర్నీలలో ఆసీస్ లాంటి ఫియర్ లెస్ గేమ్ ఆడాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటితో నాలుగు కప్‌లు ఆసీస్ చేతికి అందించాం. మరి ముందొచ్చే మరో డబ్ల్యూటీసీ ఛాంపియన్ షిప్ పరిస్థితి ఏంటి.? అని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
A golden period for Australia 🇦🇺
Five concurrent trophies across the men’s, women’s and now the future stars at the Men’s #U19WorldCup 🏆
More 👉 https://t.co/wCXxFxxkF3 pic.twitter.com/NzQNCLpERB
— ICC (@ICC) February 12, 2024