Kavya Maran: గుసగుసలకు చెక్.. ఎట్టకేలకు అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ ఫిక్స్.. వెడ్డింగ్ ఎక్కడంటే ?
Kavya Maran: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. వీరిద్దరూ నవంబర్ 10న గ్రీస్ వేదికగా వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సినీ, క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Kavya Maran: గత కొన్ని నెలలుగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి త్వరలోనే జరుగబోతుందన్న వార్తలు జోరందుకున్నాయి. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ జంట నవంబర్ 10వ తేదీన విదేశాల్లో ఏడడుగులు వేయబోతోంది. అత్యంత అందమైన గ్రీస్ నగరం ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వేదిక కానుందని తెలుస్తోంది. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
గతంలో వీరిద్దరూ కలసి గ్రీస్ పర్యటనకు వెళ్లిన సమయంలో తీసిన కొన్ని చిత్రాలు బయటకు రావడంతోనే ఈ డేటింగ్ వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అదే గ్రీస్ వేదికగా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రచారంలోకి రావడంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటివరకు అటు కావ్య గానీ, ఇటు అనిరుధ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అనిరుధ్ మావయ్య వ్యాఖ్యలతో ఊహాగానాలు
ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుస్తూ అనిరుధ్ మావయ్య, ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తన అల్లుడి వివాహం చాలా ఘనంగా జరగబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కావ్య మారన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఆమె ఒక సాధారణ యువతి కాదని, ఒక పెద్ద స్పోర్ట్స్ టీమ్‌ను విజయవంతంగా నడిపించే సామర్థ్యం ఉన్న వ్యాపారవేత్త అని ప్రశంసల వర్షం కురిపించారు. తండ్రి నుంచి వచ్చిన వ్యాపార నైపుణ్యాలు ఆమెలో పుష్కలంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కామెంట్స్ తర్వాత నెటిజన్లు వీరి వివాహం దాదాపు ఖాయమేనని భావిస్తున్నారు.
ఇటు సన్ గ్రూప్ వారసురాలు.. అటు కంపోజింగ్ కింగ్
సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఈవోగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మైదానంలో ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతుంటాయి. మరోవైపు అనిరుధ్ దక్షిణారదిలోనే అత్యంత డిమాండ్ ఉన్న సంగీత దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలను బ్లాక్‌బస్టర్ విజయం వైపు నడిపిస్తున్నాయి.
ప్రస్తుతం అనిరుధ్ తెలుగులో ది ప్యారడైజ్ చిత్రంతో పాటు జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ప్రాజెక్ట్, బాలకృష్ణ-కొరటాల శివ చిత్రాలకు స్వరాలు సమకూర్చుతున్నారు. ఇంతటి భారీ క్రేజ్ ఉన్న వీరిద్దరి కలయిక గురించి వస్తున్న వార్తలపై పూర్తి స్పష్టత రావాలంటే ఇరువర్గాల నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
