బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 4వ టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తర్వాత, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పెద్ద మార్పు చేటుచేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో స్థానం కోసం భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. మెల్‌బోర్న్ టెస్టు ఓటమి తర్వాత టీమిండియా ఆశలకు గండి పడింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియాకు 340 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఇచ్చింది. అయితే టీమిండియా పరుగులను చేధించడంలో విఫలమైంది. దీంతో ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. WTC ఫైనల్ రేసు నుండి టీమిండియా నిష్కమించిది. అయితే భారత్ WTC ఫైనల్ చేరుకోవడానికి ఒక్కటే మార్గం ఉంది. అది ఏంటంటే భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. అలాగే ఆసీస్ తర్వాత శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లో శ్రీలంక ఒక్క మ్యాచ్ అయినా ఆసీస్ ఓడిపోవాలి. ఒకవేళ రెండు మ్యాచ్‌లు డ్రా అయినా భారత్ WTC ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.
మెల్‌బోర్న్ టెస్టు తర్వాత కూడా టీమిండియా పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. 18 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 7 ఓటముల తర్వాత టీమిండియా ఇప్పటివరకు 2 డ్రా మ్యాచ్‌లు ఆడింది. ఆస్ట్రేలియా 16 టెస్టుల్లో 10వ మ్యాచ్‌లో విజయం సాధించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 చివరి మ్యాచ్ ఇప్పుడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాదిలో జరుగుతుంది. ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌ని ఎలాగైనా గెలవాలి, లేకుంటే ఫైనల్ రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే సిడ్నీ టెస్టులో గెలిచిన తర్వాత కూడా టీమ్‌ఇండియాకు ఫైనల్ టిక్కెట్ దక్కదు. సిడ్నీ టెస్టులో గెలిచి భారత జట్టు ఫైనల్స్‌కు వెళుతుందా లేదా అనేది ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరగనున్న 2 టెస్టుల సిరీస్‌ని బట్టి నిర్ణయించబడుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక గెలిస్తే భారత్, ఆస్ట్రేలియాలను మట్టికరిపించి ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి