Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుకలకు ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా పీవీ సింధు..

|

Jul 28, 2022 | 6:31 AM

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలు 2022 ప్రారంభోత్సవ వేడుకకు రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని సాధించిన పివి సింధును..

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 ప్రారంభ వేడుకలకు ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా పీవీ సింధు..
Pv Sindhu
Follow us on

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలు 2022 ప్రారంభోత్సవ వేడుకకు రెండుసార్లు ఒలింపిక్ పతకాన్ని సాధించిన పివి సింధును ఇండియా టీమ్‌కు ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేశారు. 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలోనూ పీవీ సింధు జెండాను ప్రదర్శించారు. ఆ ఎడిషన్‌లో మహిళల సింగిల్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న సింధు.. తాజా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించాలని శ్రమిస్తోంది.

‘‘రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన షట్లర్ పీవీ సింధును భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఓపెనింగ్ కార్యక్రమంలో టీమ్ ఇండియా ఫ్లాగ్ బేరర్‌గా ప్రకటించడం ఆనందంగా ఉంది’’ అంటూ ఐఓఏ ప్రకటన విడుదల చేసింది. మరో ఇద్దరు అథ్లెట్లు వెయిల్ లిఫ్టర్ ఎంఎస్ మీరాబాయి చాను, బాక్సర్ ఎంఎస్ లోవ్లీనా బోర్గోహైన్ లను కూడా ప్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసింది ఐఓఏ.

కాగా, పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. సింగపూర్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్‌ టైటిళ్లను కూడా కైవసం చేసుకుంది. కాగా, కామన్‌వెల్త్ గేమ్స్ 2022 ప్రచారాన్ని ఆగస్టు 3న ప్రారంభించనుంది పీవీ సింధు. ఇక ఈ గేమ్స్ ప్రారంభ వేడుక గురువారం(జూలై 28) బర్మింగ్‌హామ్‌లోని అలెగ్జాండర్ స్టేడియంలో జరుగుతుంది.

నీరజ్ చోప్రాకు నిరాశే..
ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాకు నిరాశే ఎదురైంది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల ప్రారంభోత్సవంలో ఫ్లాగ్ బేరర్‌గా దేశానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కోల్పోయినందుకు నిరాశను వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. “నా టైటిల్‌ను కాపాడుకోలేకపోవడం, దేశానికి ప్రాతినిధ్యం వహించే మరో అవకాశాన్ని కోల్పోవడం చాలా బాధ కలిగించింది. ఓపెనింగ్ సెలబ్రేషన్స్‌లో టీమ్ ఇండియా ఫ్లాగ్ బేరర్‌గా ఉండే అవకాశాన్ని కోల్పోయినందుకు చాలా నిరాశకు గురయ్యాను. రానున్న రోజుల్లో ఈ గౌరవాన్ని పొందుతానని ఆశగా ఎదురు చూస్తున్నాను.’ అని పేర్కొన్నారు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..