ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు దుబాయ్‌లోని దుబాయి ట్రేడ్ సెంటర్లో 22 వ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 127 దేశాల నుంచి పలు ఆహార సంస్థల తయారీదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ ఫెస్టివల్లో తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆహార ఉత్పత్తుల సంస్థ తెనాలి డబల్ హార్స్ సైతం ఈ ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొంది.
తెనాలి డబల్ హార్స్ సంస్థ సైతం ఫుడ్ ఫెస్టివల్లో తన స్టాల్‌ని ఏర్పాటు చేసింది. తెనాలి డబల్ హార్స్ సంస్థ ఇటీవలి కాలంలో తన ఉత్పత్తుల విస్తృతిని బాగా పెంచి, ప్రపంచంలోని ఎన్నో దేశాలకు తమ ప్రాడక్ట్‌లను ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 19 నుండి 23 వరకు దుబాయ్‌లోని దుబాయి ట్రేడ్ సెంటర్లో జరిగిన 22 వ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్లో స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెనాలి డబల్ హార్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మునగాల శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
తెనాలి డబల్ హార్స్ సంస్థ ఉత్పత్తుల విస్తృతి ని బాగా పెంచి, ప్రపంచంలోని ఎన్నో దేశాలకు తమ ప్రాడక్ట్ లను ఎగుమతి చేస్తోందని తెలిపారు. దుబాయ్‌లో ఏర్పాటు చేసిన స్టాల్లో పలు దేశాలకు చెందిన ప్రతినిధులు తెనాలి డబల్ హార్స్ ఉత్పత్తులకు ఆకర్షితులయ్యారని తెలిపారు. తెనాలి డబల్ హార్స్ సంస్థ ప్రపంచ ప్రమాణాలని, ప్రపంచ మార్కెట్ అవసరాలని, భవిష్యత్ వ్యూహాలని అర్థం చేసుకోవటంలో ఈ గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పుకొచ్చారు.
తెనాలి డబల్ హార్స్ సంస్థ ఉత్పత్తులు ప్రపంచ దేశాల ప్రజలకు, ప్రతినిధులకు బాగా చేరువయ్యాయని అలాగే రూరల్ టు గ్లోబల్ అనే నినాదంతో మేడ్ ఇన్ తెనాలి మేడ్ ఫర్ గ్లోబల్‌తో ముందుకెళుతున్నాం అని తెనాలి శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు.