కొత్తగా కారు కొనుగోలు చేసిన ప్రతీ వ్యక్తి.. అది డ్యామేజ్ అయినా, రిపేర్‌కొచ్చినా, షెడ్డుకెళ్లినా.. పూర్తి కవరేజ్ ఇచ్చే కారు బీమాల కోసం వెతుకుతుంటారు. ఇలా అద్భుతమైన ప్రయోజనాలు ఇచ్చే కారు బీమా యాడ్-ఆన్‌లలో.. జీరో డిప్రిసియేషన్ కవర్ ఒకటి. ఇది మీ ఫోర్ వీలర్‌కు మంచి కవరేజ్‌ను అందించే బీమా యాడ్-ఆన్.. వాహనంలోని అన్ని స్పేర్ పార్ట్‌లకు ఇది పూర్తి కవరేజ్ బీమా అందిస్తుంది. దీంతో మీకు ఖర్చు భారం కూడా తగ్గుతుంది. మరి అసలు ఈ ‘జీరో డిప్రిసియేషన్ కవర్’ అంటే ఏమిటి.? అసలు ఎందుకు దీన్ని కొనుగోలు చేయాలి.? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీ కారు పాడైపోయినప్పుడు, మీరు క్లెయిమ్ రైజ్ చేస్తే.. మీకు వచ్చే మొత్తంలో డ్యామేజ్‌లు, రిపేర్‌లకు పోనూ మిగిలింది ముడుతుంది. ఆ డిప్రిసియేషన్ అమౌంట్ సాధారణంగా 5 శాతం నుంచి 50 శాతం మధ్య ఉంటుంది. అది కూడా 0-6 నెలలు. మీ కారు కొనుగోలు చేసిన సంవత్సర కాలం 5 సంవత్సరాలు మించకూడదు. ఈ తరుణంలో ‘జీరో డిప్రిసియేషన్ కవర్’ మీకు ఉపయోగపడుతుంది. ఇలా సగం మొత్తం రాకుండా.. కారు డ్యామేజ్ అయినప్పుడు.. క్లెయిమ్ రూపంలో డబ్బు అంతా మీ చేతుల్లోకి వచ్చేలా చేస్తుంది.
‘జీరో డెప్ కవర్’తో కూడిన కారు బీమా మెరుగైన కవరేజ్‌ని అందిస్తుంది. మీ కారు భారీ డ్యామేజ్‌లతో షెడ్డుకొచ్చినప్పుడు.. ఈ ‘జీరో డెప్ కవర్’ అధికంగా ఖర్చు అయ్యే రిపేర్లను చూసుకుంటుంది. తద్వారా మీ జేబులు చిల్లు కాకుండానే.. కారును మళ్లీ మాములు స్థితికి చేర్చవచ్చు. ఈ యాడ్-ఆన్‌ను సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీకి జోడించినట్టైతే.. మరమ్మతులకు పూర్తి స్థాయిలో కవరేజీని అందిస్తుంది.
ఈ పాలసీ మీ కారు రిపేర్లకు, డ్యామేజ్‌లకు.. మీపై ఎలాంటి ఖర్చు లేకుండా రూపొందించబడింది. మీ వాహనం పూర్తి మరమ్మతులకు అయ్యే మొత్తం ఖర్చులను.. ఇది క్లెయిమ్ ద్వారా కవర్ చేస్తుంది. అలాగే దీని ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా విడిభాగాలను సైతం మార్చవచ్చు.
కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో ఏవైన విడిభాగాలు పాడైపోయినప్పుడు.. వాటిని కొనుగోలు చేసేందుకు మీ డబ్బును పెట్టాల్సి ఉంటుంది. ‘జీరో డెప్ కవర్’ దాన్ని తగ్గిస్తుంది. మీపై ఎలాంటి అదనపు ఖర్చులు పడకుండా చూసుకుంటుంది.
జీరో డిప్రిసియేషన్ కవర్ అనేది ఒక యాడ్-ఆన్. అదనంగా ఇంకా సరసమైన ధరలో లభించే ప్రీమియం. దీర్ఘకాలంలో మీ కారు పూర్తి మరమ్మతులకు లేదా విడిభాగాల భర్తీకి అయ్యే ఖర్చును బట్టి.. మీరు ఈ యాడ్-ఆన్‌కు చెల్లించే ప్రీమియం చాలా విలువైనదిగా భావిస్తారు.
స్టాండర్డ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ‘జీరో డిప్రిసియేషన్ కవర్’ క్లెయిమ్ ప్రాసెస్ వేగవంతంగా, సులభంగా పూర్తవుతుంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ క్లెయిమ్‌ను పొందొచ్చు.
కవరేజీ విషయంలో ఎలాంటి తగ్గింపులు ఉండవు, అడ్డంకులు ఉండవు కాబట్టి.. మీరు పూర్తిస్థాయి విశ్వాసంతో దేశమంతా తిరిగేయొచ్చు. ఏ కారు డ్యామేజ్ అయినా కూడా ఈ ‘జీరో డెప్ కవర్’ కవరేజ్ అందిస్తుంది. ఇలాంటి పూర్తి స్థాయి కవరేజీ.. మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా డ్రైవింగ్ చేసేందుకు సహాయపడతుంది.
ప్రతీ కారు ఓనర్ తప్పనిసరి ఈ ‘జీరో డిప్రిసియేషన్ కవర్’ కొనుగోలు చేయాలి. ఇదిలా ఉంటే.. పలు వర్గాల వారికి ఈ ‘జీరో డిప్రిసియేషన్ కవర్’ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. వారెవరో ఇప్పుడు చూద్దాం.
మీరు ఇటీవల కొత్త కారును తీసుకున్నట్లయితే.. దానిని పూర్తిగా రక్షించుకునేందుకు జీరో డిప్రిసియేషన్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ మీ కారు మొత్తం డ్యామేజ్ అయినా.. ఈ జీరో డెప్ కవర్‌తో అది తిరిగి మాములు స్థితికి వచ్చేస్తుంది.
లగ్జరీ కార్ల ఓనర్లకు ఈ జీరో డెప్ కవర్ ఎంతగానో ఉపయోగకరం. కారుకు భారీ డ్యామేజ్ అయినప్పుడు.. తక్కువ డబ్బులతో విడిభాగాలను భర్తీ చేసేందుకు ఇది సహాయపడుతుంది. జీరో డెప్ బీమా పూర్తి మరమ్మతుల ఖర్చులను కవర్ చేస్తుంది.
మీరు అధిక రద్దీ ఉండే నగరాల్లో కారు నడుపుతున్నట్లయితే.. అప్పుడు ఖచ్చితంగా జీరో డెప్ కవర్ అందించే బీమాను కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి.
ఈ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ముందుగా కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. కారు కొనుగోలు చేసిన కాలం, యాడ్-ఆన్స్ ధర, కవరేజ్ అంశాలు, అలాగే వాడిన క్లెయిమ్స్ సంఖ్య లాంటివి చూసుకోవాలి. స్థిరపడిన, కస్టమర్లకు అనుగుణంగా కారు బీమాలు అందించే ప్రొవైడర్స్‌లో ఒకటైన టాటా AIG జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్సును సరసమైన ధరల్లో తగిన కవరేజ్ ప్రయోజనాలతో అందిస్తోంది. మీరు ఆన్‌లైన్ టాటా ఏఐజీ క్యాలుకులెటర్ ద్వారా వారి బీమా ధరలను ఒకసారి పరిశీలించి.. తెలివైన ఆర్ధిక నిర్ణయాలు తీసుకోండి.
ఈ మధ్యకాలంలో కారు విడిభాగాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక కొన్ని డ్యామేజ్‌లకు ప్రీమియం సరిగ్గా లభించకపోవడంతో.. సదరు కస్టమర్‌కు నెట్టి మీద కుదిబండలా మారింది. జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్సు ఈ ఖర్చులను మీరు సగానికి సగం తగ్గించుకోవచ్చు. ఇది నిస్సందేహంగా లగ్జరీ లేదా స్పోర్ట్స్ కార్ల యజమానులు, కొత్త కారు యజమానులకు తప్పనిసరి. కాగా, జీరో డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే సమయంలో మీరు.. కారు కొనుగోలు చేసిన కాలం, కవర్ ధర, మినహాయింపులు, వర్తించే క్లెయిమ్‌ల సంఖ్యపై పరిమితిని గుర్తుపెట్టుకోండి. సకాలంలో ప్రయోజనాలను పొందండి!