Ozone Hospitals: పదేళ్లలో మిలియన్‌కుపైగా హ్యాపీ పేషెంట్లు.. ఓజోన్‌ హాస్పిటల్స్‌ పదో వార్షికోత్సవ వేడుకలు

|

Feb 12, 2024 | 1:21 PM

అతి తక్కువ సమయంలోనే మెరుగైన సేవలు అందించి ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నాయి. పేషెంట్లకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి ఓజోన్‌ ఆస్పత్రులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలోని కొత్తపేట, అల్వాల్‌ ప్రాంతాలలో ఆస్పత్రులను నెలకొల్పి ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఈ ప్రముఖ ఓజోన్‌ హాస్పిటల్స్‌ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాయి..

Ozone Hospitals: పదేళ్లలో మిలియన్‌కుపైగా హ్యాపీ పేషెంట్లు.. ఓజోన్‌ హాస్పిటల్స్‌ పదో వార్షికోత్సవ వేడుకలు
Ozone Hospital
Follow us on

ఓజోన్‌ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆస్పత్రులు ఏర్పాటైన నాటి నుంచి అద్భుతమైన సేవలు అందిస్తూ పేషెంట్లకు అండగా నిలుస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే మెరుగైన సేవలు అందించి ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నాయి. పేషెంట్లకు విశేషమైన సేవలు అందిస్తున్నాయి ఓజోన్‌ ఆస్పత్రులు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలోని కొత్తపేట, అల్వాల్‌ ప్రాంతాలలో ఆస్పత్రులను నెలకొల్పి ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఈ ప్రముఖ ఓజోన్‌ హాస్పిటల్స్‌ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకున్నాయి.

10 ఫిబ్రవరి, 2024 శనివారం సాయంత్రం 5 గంటల నుంచి నాగోల్‌లోని పీబీఆర్‌ కన్వెన్షన్‌లో ఆస్పత్రులు పదవ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఆర్‌అండ్‌బి, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అతిథులు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ప్రత్యేక అతిథులుగా జీవన్‌లాల్‌ లావిడియా, ఆదాయపు పన్ను కమిషనర్‌, డాక్టర్‌ జిబి. రావులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఓజోన్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ బి.వి సత్యసాయి ప్రసాద్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీప్తి గడ్డం మాట్లాడుతూ.. మా హాస్పిటల్‌ ఈ పది సంవత్సరాలలో ఒక మిలియన్‌కుపై హ్యాపీ పేషెంట్స్‌ ఉన్నందున చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. తమ ఆస్పత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు. పేషెంట్లకు విశేషమైన సేవలు అందిస్తూ తమ ఆస్పత్రుల సేవలు మరింతగా విస్తరించనున్నామని వెల్లడించారు.

Ozone Hospitals