Vastu Tips: ఆర్థిక ఒడిదుడుకలతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకోండి.. ఇక డబ్బే డబ్బు..!

|

Nov 16, 2021 | 10:10 PM

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి గురించి ఎన్నో విశేషాలను ప్రస్తావించారు. వాస్తు చిట్కాలలో.. ఇంటి దిశ ఎలా ఉండాలి, ఏ వస్తువు ఎటు వైపునకు ఉండాలి అనే దానికి

Vastu Tips: ఆర్థిక ఒడిదుడుకలతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకోండి.. ఇక డబ్బే డబ్బు..!
Vasthu
Follow us on

Vastu Tips: వాస్తు శాస్త్రంలో ఇంటి గురించి ఎన్నో విశేషాలను ప్రస్తావించారు. వాస్తు చిట్కాలలో.. ఇంటి దిశ ఎలా ఉండాలి, ఏ వస్తువు ఎటు వైపునకు ఉండాలి అనే దానికి సంబంధించిన ప్రతీ అంశం చెప్పబడింది. ప్రతి ఇంటి నిర్మాణం సానుకూల, ప్రతికూల శక్తులను ఇస్తుందని వాస్తు శాస్త్రంలో స్పష్టం చేయబడింది. సానుకూల శక్తి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ప్రతికూల శక్తి ఆర్థిక, అనారోగ్య సమస్యలను సృష్టిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే జీవితంలో అనేక కష్టాలు, అపజయాలు, మానసిక బాధలు కూడా వస్తాయి. అయితే, వాస్తు దోషాల నివారణకు వాస్తు శాస్త్రంలో అనేక పరిష్కార మార్గాలు, చర్యలు ఉన్నాయి. వీటిని పాటించడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించి ఇంటికి శ్రేయస్సును పొందవచ్చు. ఇంట్లో వస్తువులను సరైన దిశలో పెడితే సంతోషం, ఐశ్యర్యం సిద్ధిస్తాయి.

లాభం కోసం..
ఎన్ని ప్రయత్నాలు సాగించినా.. మీ జీవితంలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతూనే ఉందా? అయితే, మీ ఇంట్లో మాతా లక్ష్మి, కుబేరుడి ఫోటోను ఖచ్చితంగా ఉంచాలి. ఈ చిత్ర పటాలను ఇంటికి ఉత్తర దిశలో ఏర్పాటు చేయాలి.

అందమైన చిత్రాలు..
ఇంటి గోడలపై అందమైన చిత్రాలను పెట్టుకోవాలి. ఇళ్లు అందంగా ఉంటే.. ఐశ్యర్యం కూడా పెరుగుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి దక్షిణ, తూర్పు దిశల గోడలలో ప్రకృతికి సంబంధించిన వస్తువులు, చిత్రాలను మాత్రమే ఉంచాలి.

నవ్వుతున్న పాప ఫోటో..
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో చిన్న పిల్లలు నవ్వుకునే చిత్రాన్ని ఉంచడం చాలా మంచిది. ఇంట్లో నవ్వుతున్న పిల్లల చిత్రాన్ని ఉంచడం వల్ల ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఏర్పడుతుంది. అంతే కాదు తూర్పు, ఉత్తర దిశలో పిల్లల చిత్రపటాన్ని ఉంచడం శ్రేయస్కరం.

నది, జలపాతం చిత్రం..
ఇంటికి ఈశాన్య దిశలో నదులు, జలపాతాల చిత్రాన్ని ఉంచడం ద్వారా సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. మీరు ఇంట్లో పూజగది నిర్మించినట్లయితే, నైరుతి దిశలో నిర్మించిన గదిని పూజకు ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

Pushpa Song: పుష్ప రాజ్ ఊరమాస్ లుక్.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డ లిరికల్ ప్రోమో రిలీజ్..

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ సీరియస్.. వాష్‏రూంలోకి వెళ్లి గడియ పెట్టుకున్న సిరి.. ఆందోళనలో హౌస్‏మేట్స్..

Ramya Krishna: మెగాస్టార్ సినిమాలో రమ్యకృష్ణ.. కీలక పాత్రలో నటించనున్న శివగామి..