భారతదేశ వ్యాప్తంగా శరన్నవరాత్రులు.. దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. దాదాపు తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ సంబరాలను.. చివరిరోజు దసరాతో ముగుస్తుంది. ఇక చివరి రోజున రావణ దహనంతో ముగిసే ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. దసరా పండగ వచ్చిందంటే.. నెల అంతా ఎంతో ఘనంగా సంబరాలను జరుపుకుంటారు. కేవలం రాష్ట్రంతో సంబంధం లేకుండా.. మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో దసరా వేడుకలను నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దసరా వేడుకలను జరుపుకుంటారు. ఇక కొన్ని ప్రాంతాల్లో విజయదశమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించుకుంటారు.
ఉత్తర ప్రదేశ్.. రావణ దహనం..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దసరా వేడుకలలో రావణ దహనం ముఖ్యమైన భాగం. అక్కడ రాముడితో రావణుడిని వధించే విధంగా విగ్రహాలను ద్వంసం చేస్తుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. రావణ దహనం వేడుకలను వారణాసి, లక్నో, కాన్పూర్ ప్రదేశాలలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.
మైసూర్ దసరా.. కర్ణాటక..
దక్షిణాదిలోని మైసూర్ ప్రాంతంలో విజయదశమి వేడుకలు చూడడానికి రెండు కళ్లు చాలవు. మైసూర్ దసరా పండగ సాంస్కృతిక ప్రదర్శనలు, కవాతులు, పోటీలు వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా మైసూర్ ప్యాలెస్‌ను దీపాలతో చూపు తిప్పుకోలేనంత అందంగా తయారు చేస్తారు..
కులు.. హిమాచల్ ప్రదేశ్..
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కులు ప్రాంతంలో దసరా అతి పెద్ద పండగా.. ఇక్కడ విజయదశమి వేడుకలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ విభిన్నంగా దసరా వేడుకను నిర్వహిస్తారు. ఇక్కడ ఉత్సవాలు ఏడు రోజుల పాటు.. ఘనంగా నిర్వహిస్తూ.. రఘునాథ్ దేవుడిని ఆరాధిస్తారు..
కోటా.. రాజస్తాన్.
కోటాలో దసరా చాలా ప్రసిద్ధి. ఇక్కడ ప్రముఖ హస్తకళాకారులు.. సాంస్కృతిక కళాకారులతో పాల్గోని జాతర మాదిరిగా జరుపుకుంటారు. పండుగ ముగింపు సందర్భంగా గ్రామస్తులు సంప్రదాయ దుస్తులు ధరించి రావణుడిని ఆరాధిస్తారు. ఆ తర్వాత రావణ్ విగ్రహాలను దహనం చేస్తారు. చంబల్ నది ఒడ్డున ఘనంగా జాతర జరుగుతుంది.
గుజరాత్.. గర్బా..
గుజరాత్ రాష్ట్రంలో దసరా పండగ ఘనంగా జరుగుతుంది. హాలెరి రాజుల ఆధిపత్య చరిత్రలో దసరా పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ కార్నివాల్ పండుగను మరియమ్మ పండుగ అని కూడా అని కూడా అంటారు. ఇక్కడ దసరా రోజున గర్బా చేస్తారు.
ఢిల్లీ రామ్ లీలా..
మన దేశ రాజధాని ఢిల్లీలో దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నగరాన్ని అందంగా ముస్తాబు చేస్తారు. అలాగే ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రసిద్ధ రామ్ లీలాను చూడటానికి జనాలు భారీ సంఖ్యలో వస్తారు. అలాగే అక్కడ నాటక ప్రదర్శనలు కూడా జరుగుతాయి. శ్రీరాముడు.. రావణుడిని వధించే కథ గురించి వివరిస్తారు..
బస్తర్.. ఛత్తీస్ గఢ్..
బస్తర్ దసరా సరికొత్త అనుభవం.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని గిరిజనులు ఈ పండుగను 75 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సంప్రదాయాన్ని 13వ శతాబ్దంలో బస్తర్ రాజు పురుషోత్తం దేవ్ బడే దొంగర్ లో ప్రారంభించారని అంటుంటారు. ఈ 75 రోజులలో పాత జాతర, కచనగాడి, నిషా జాతర వంటి అనేక ఆచారాలను నిర్వహిస్తుంటారు.
MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణలు నిరాధారం.. మా ఎన్నికల అధికారి వివరణ