సనాతన హిందూ మతం ప్రకారం.. స్నానానికి గొప్ప స్థానం ఉంది. అందులోనూ సముద్ర స్నానానికి, పుణ్యక్షేత్రాల్లో నదీస్నానానికి కూడా ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఇవాళ మనం ఆశ్వయుజ మాసం పౌర్ణమి నుండి కార్తీక మాసం చివరి వరకు చేసే కార్తీక స్నానం గురించి తెలుసుకుందాం. దసరా పండుగ తర్వాత వచ్చే పౌర్ణమి నుంచి మొదలై కార్తీక మాసం పౌర్ణమి వరకు ఒక నెలపాటు తీర్థస్నానం చేయడం వలన ఆధ్మాత్మిక పరంగా చాలా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ మాసంలో, సూర్యోదయానికి ముందు రెండు ఘాటీలు అంటే ఒక సుమారు ఒక గంట ముందు చేసే తీర్థస్నానాన్ని కార్తీక స్నానం అంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లడం అసాధ్యమనుకుంటే.. పుణ్యక్షేత్రాల నుంచి తీసుకువచ్చిన నీటిని ఉపయోగించి స్నానం చేయొచ్చు. అయితే దీనికి ముందు ఒక మంత్ర పఠించాల్సి ఉంటుంది. ‘మహావిష్ణోః అనుగ్రహ ప్రాప్త్యర్థం తీర్థస్నానం కరిష్యే’ అని ఈ క్రింది మంత్రాన్ని జపించి స్నానం చేయాలి.
అని చెప్పి, ముందుగా అర్ఘ్యాన్ని సమర్పించాలి.
ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలి.
కార్తీక మాసంలో ఈ విధంగా స్నానం చేస్తే సర్వపాపాలు నశించి, శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సంపదలు పెరుగుతాయి. నిత్యే నైమిత్తికే కృష్ణకార్తికే పాపనాశ అనే మంత్రం శాస్త్రాలలో ఉంది. అలాగే ఏదైనా మతపరమైన పనుల నిమిత్తం నిత్యం స్నానం చేస్తే బాహ్య పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల అంతర్గత పాపాలు కూడా నశిస్తాయి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత నుదుటిపై తిలకం పెట్టుకోవాలి.
ఈ మంత్రాన్ని చెప్పిన తరువాత తూర్పు ముఖంగా నిలబడి, ఒక గిన్నెలో నీటిని నింపి.. ఆ నీటిని తులసి మొక్కకు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోయిన సుఖఃసంతోషాలు కలుగుతాయి. అలాగే కార్తీకమాసంలో అష్టాక్షరీ మంత్రాన్ని పఠించడం ఉత్తమం. అష్టాక్షరీ మంత్రం ‘ఓం నమో నారాయణాయ’. ఈ మంత్రాన్ని పఠించి లక్ష్మీ సమేతుడైన నారాయణుడికి హవిష్యన్న(నెయ్యితో అన్నం) నైవేద్యంగా సమర్పించి, స్వీకరిస్తే ఆ ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది. సంతానం లేకపోతే సంతానం కలుగుతుంది. అలాగే కార్తీక స్నానానికి పుణ్యక్షేత్రాలకు వెళ్లడం వల్ల పుణ్యఫలం ఎక్కువ. కార్తీక మాసంలో విష్ణు సంబంధిత పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం విశేషం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి…