Jagannath Rath Yatra: పూరి రథ యాత్రకు ఏటా కొత్త రథాలు తయారీ.. రథ యాత్ర ముగిసిన తర్వాత ఏమి చేస్తారో తెలుసా..

|

May 29, 2024 | 11:17 AM

జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. జగన్నాథుడుని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. రథయాత్ర రోజున జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి మూడు వేర్వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరి వెళ్తాడు. అన్నదమ్ముల సోదరి కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు.

Jagannath Rath Yatra: పూరి రథ యాత్రకు ఏటా కొత్త రథాలు తయారీ.. రథ యాత్ర ముగిసిన తర్వాత ఏమి చేస్తారో తెలుసా..
Jagannath Rath Yatra
Follow us on

ఒడిశాలో జగన్నాథ రథయాత్రకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండో రోజున జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 7 నుంచి ప్రారంభం కానుంది. జగన్నాథుని రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని ఒక మత విశ్వాసం ఉంది, అయితే ప్రయాణం పూర్తయిన తర్వాత ఈ రథాలు, వాటి కర్రలకు ఏమి చేస్తారు? ఈ రోజు తెలుసుకుందాం.. జగన్నాథుడు అంటే విశ్వానికి ప్రభువు అని అర్థం. జగన్నాథుడుని శ్రీ మహా విష్ణువు అవతారంగా భావిస్తారు. రథయాత్ర రోజున జగన్నాథుడు తన అన్న బలభద్రుడు, చెల్లెలు సుభద్రతో కలిసి మూడు వేర్వేరు రథాలపై నగర పర్యటన కోసం బయలుదేరి వెళ్తాడు. అన్నదమ్ముల సోదరి కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలు తయారు చేస్తారు.

జగన్నాథ యాత్ర రథాలు

భగవాన్ జగన్నాథుడు, బలభద్ర, సుభద్రల రథాలు వేప, హంసి చెట్ల చెక్కతో తయారు చేస్తారు. ఈ చెట్లను జగన్నాథ దేవాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది. వీరి పని ఆరోగ్యకరమైన, పవిత్రమైన వేప చెట్లను గుర్తించడం. విశేషమేమిటంటే రథం తయారీలో గోళ్లు, మేకులు లేదా మరే ఇతర లోహాన్ని ఉపయోగించరు. ప్రతి సంవత్సరం కొన్ని కుటుంబాల సభ్యులు మాత్రమే రథాలను నిర్మిస్తారు. ఈ పని కోసం వీరు ఎటువంటి ఆధునిక యంత్రాన్ని ఉపయోగించరు. వీరిలో చాలా మందికి అధికారిక శిక్షణ కూడా లేదు. ఈ వ్యక్తులు తమ పూర్వీకుల నుండి పొందిన జ్ఞానం ఆధారంగా ప్రతి సంవత్సరం ఖచ్చితమైన, ఎత్తైన, బలమైన రథాలను తయారు చేస్తారు.

ఇవి కూడా చదవండి

జగన్నాథ యాత్ర తర్వాత రథాన్ని ఏమి చేస్తారంటే?

జగన్నాథుని రథయాత్ర ప్రధాన ఆలయం నుంచి మొదలై 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతని అత్త ఇంటి గుండిచా ఆలయం వద్ద ముగుస్తుంది. ఇక్కడ జగన్నాథుడు 7 రోజులు విశ్రాంతి తీసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. దీనినే బహుదా యాత్ర అంటారు. బలభద్రుడి రథం ప్రయాణంలో ముందుభాగంలో కదులుతుంది. సోదరి సుభద్ర రథం మధ్యలో, జగన్నాథుని రథం వెనుక ఉంటుంది. ఈ మూడు రథాలు చాలా పెద్దవి. వీటి సగటు ఎత్తు 13 మీటర్లు (42 అడుగులు).

రథ యాత్ర పూర్తయిన తర్వాత ..రథం భాగాలు వేరు చేస్తారు. నివేదికల ప్రకారం, రథంలో ఎక్కువ భాగం వేలం వేయబడుతుంది. దీని భాగాల వివరాలు శ్రీజగన్నాథ వెబ్‌సైట్‌లో ఇస్తారు. రథం చక్రం అత్యంత ఖరీదైన భాగం కాగా దీని ప్రారంభ ధర రూ.50 వేలు. రథం భాగాలను కొనుగోలు చేయాలనే ఆసక్తి గలవారు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అంతేకాదు వీటిని ఎవరు స్వీకరించినా వాటిని ఉపయోగించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. ఆలయ నోటిఫికేషన్ ప్రకారం చక్రాలు, ఇతర భాగాలను సురక్షితంగా ఉంచడం కొనుగోలుదారుడి బాధ్యత.

వేలంలో మాత్రమే కాదు.. రథంలో మిగిలిన కలపను ఆలయ వంటగదికి పంపుతారు. అక్కడ దేవతలకు ప్రసాదం వండడానికి ఇంధనంగా ఉపయోగిస్తారు. ఈ ప్రసాదాన్ని ప్రతిరోజు సుమారు లక్ష మంది భక్తులకు అందజేస్తారు. ఈ ప్రసాదం తయారుచేసిన వంటగది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పూరీలో ఉన్న జగన్నాథ దేవాలయం కిచెన్ మెగా కిచెన్. భగవంతునికి సమర్పించేందుకు ఇక్కడ రోజూ 56 రకాల నైవేద్యాలు తయారుచేస్తారు. నేటికీ ఈ ఆహారమంతా మట్టి కుండల్లోనే తయారు చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..