భారతదేశంలో హోలీని వివిధ సంప్రదాయాలతో జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హోలీని రంగులతో జరుపుకుంటున్నప్పటికీ.. హోలీని జరుపుకునే సంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. వారణాసి, మధుర వంటి క్షేత్రాల్లో జరుపుకునే హోలీ భిన్నంగా ఎలా ఉంటుందో అదే విధంగా కొన్ని గ్రామాల్లో విచిత్రమైన సంప్రదాయంతో హోలీ పండగను జరుపుకుంటారు. ఈ రోజు అలాంటి ఒక విచిత్ర సంప్రదాయ హోలీ గురించి తెలుసుకుందాం.. ఈ హోలీ సంప్రదాయం భారతదేశంలోని మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సుమారు 86 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ సంప్రదాయం బీడ్ జిల్లాలోని కేజ్ తహసీల్‌లోని విదా గ్రామంలో జరుగుతుంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో గత 86 ఏళ్లుగా ఈ వింత హోలీ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ హోలీ రోజున ఇంటికొచ్చిన కొత్త అల్లుడిని ముందుగా గాడిదపై కూర్చోబెట్టి.. గ్రామం అంతా చుట్టి హోలీ కూడా ఆడిస్తారు. ఈ గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజున గ్రామంలోని కొత్త అల్లుడు గ్రామానికి వచ్చి హోలీ జరుపుకోవాలని ప్రత్యేక ఆహ్వానం అందజేస్తారు.
స్థానిక ప్రజల కథనం ప్రకారం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని విదా యెవ్తా గ్రామంలో సుమారు 86 ఏళ్ల క్రితం దేశ్‌ముఖ్ కుటుంబం నివసించేది. దేశ్‌ముఖ్ కుటుంబంలో ఒక కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత ఆమె మొదటి హోలీ రోజున కూతురు, అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు అల్లుడు రంగులు జల్లుతూ హోలీ ఆడేందుకు నిరాకరించాడు. దీని తరువాత, అల్లుడిని హోలీని జరుపుకోవడానికి రంగులను జల్లడానికి అతి కష్టం మీద మామగారు ఒప్పించారు. చాలా ప్రయత్నాల తర్వాత అల్లుడు ఒప్పుకోవడంతో మామగారు పూలతో అలంకరించిన గాడిదను ఆర్డర్ చేసి దాని మీద తన అల్లుడిని కూర్చోబెట్టి ఊరంతా తిరుగుతూ మరీ హోలీ ఆడారు.
స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం, ఆనందరావు దేశ్‌ముఖ్ అనే నివాసి ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడని చెబుతారు. ఆ ఊరి ప్రజలు ఆయనను ఎంతో గౌరవిస్తారు. అది నేటికీ కొనసాగుతూనే ఉంది. నవ వరుడికి గాడిద ఎక్కే సంప్రదాయం ఆనందరావు అల్లుడు ప్రారంభించి అప్పటి నుంచి నేటి వరకు కొనసాగుతోంది. గాడిద మీద కుర్చుని ఊరేగీ కార్యక్రమం గ్రామం మధ్య నుంచి ప్రారంభమై 11 గంటలకు హనుమాన్ దేవాలయం వద్ద ముగుస్తుంది. ఈ సంప్రదాయంలో అల్లుడికి నచ్చిన బట్టలు ఇస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు