AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi: ఆఫీసులో గణపతి విగ్రహం పెడుతున్నారా? ఈ తప్పులు చేయొద్దు.. నియమాలు పాటించండి!

Office Ganesh Idol Vastu Tips: ఆఫీసులో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారా? అయితే విగ్రహం తొండం ఏ వైపు ఉండాలి, ఏ రంగు విగ్రహాన్ని ఎంచుకోవాలి, ఏ దిశలో ప్రతిష్ఠించాలి వంటి విషయాలు తెలుసుకోవాలి. వాస్తు విశ్వాసాల ప్రకారం గణపతి విగ్రహం ఎంపిక, ప్రతిష్ఠాపనకు సంబంధించిన ముఖ్యమైన నియమాలు ఇవే.

Ganesh Chaturthi: ఆఫీసులో గణపతి విగ్రహం పెడుతున్నారా? ఈ తప్పులు చేయొద్దు.. నియమాలు పాటించండి!
Office Ganesh Idol Vastu Tips
Rajashekher G
|

Updated on: Sep 12, 2026 | 12:24 PM

Share

Ganesh Idol for Office Telugu: గణేష్ చతుర్థి సందర్భంగా ఇళ్లతో పాటు కార్యాలయాల్లోనూ గణపతి బప్పా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా, జ్ఞానం, శుభం, ఐశ్వర్యానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఆఫీసులో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహం ఆకారం, సింధూర రంగు, తొండం దిశ, స్థాపించే ప్రదేశం వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వాస్తు విశ్వాసాలు సూచిస్తున్నాయి. మీరు కూడా ఈ ఏడాది కార్యాలయంలో కొత్తగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటే.. కొనుగోలు చేసే ముందే ఈ విషయాలను తెలుసుకోవడం మంచిది.

  1. ఈ దిశలో గణపతిని ప్రతిష్ఠించాలి: వాస్తు విశ్వాసాల ప్రకారం గణపతి విగ్రహాన్ని కార్యాలయంలోని ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. అలాగే విగ్రహం ముఖం ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలని చెబుతారు. కొన్ని సంప్రదాయాల్లో పశ్చిమ దిశలో గణపతిని ప్రతిష్ఠించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అయితే గణపతి విగ్రహాన్ని దక్షిణ దిశకు అభిముఖంగా ఉంచకుండా జాగ్రత్త వహించాలని వాస్తు సూచనలు చెబుతున్నాయి.
  2. తొండం ఏ వైపు ఉండాలి?: ఆఫీసు కోసం గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు తొండం ఎడమ వైపు ఉండే విగ్రహాన్ని ఎంచుకోవడం మంచిదని సంప్రదాయ విశ్వాసం. ఇలాంటి గణపతిని శాంతి, సౌభాగ్యం, సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు.
  3. కూర్చున్న గణపతినా.. నిల్చున్న గణపతినా?: ఆఫీసు లేదా వ్యాపార ప్రదేశంలో గణపతిని ప్రతిష్ఠించేటప్పుడు నిల్చున్న గణపతి విగ్రహాన్ని శుభప్రదంగా భావించే సంప్రదాయం ఉంది. అదే ఇంట్లో అయితే కూర్చున్న గణపతి విగ్రహాన్ని పూజించడం మంచిదని కొందరు వాస్తు నిపుణులు సూచిస్తారు. అయితే విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు ప్రధానంగా భక్తి, సంప్రదాయం, పూజా విధానాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
  4. సింధూర రంగు గణపతి శుభప్రదం: గణపతి విగ్రహానికి సింధూర రంగు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అందుకే కార్యాలయం కోసం సింధూర వర్ణంలో ఉన్న గణపతి విగ్రహాన్ని ఎంచుకోవడం శుభప్రదమని మత విశ్వాసాలు చెబుతున్నాయి. ఈ రంగు శుభం, ఉత్సాహం, సానుకూలతకు ప్రతీకగా భావిస్తారు.
  5. ఇవి కూడా చదవండి
  6. కార్యాలయంలో ఒకే గణపతి విగ్రహం: వాస్తు సంప్రదాయాల ప్రకారం కార్యాలయంలో ఒకే గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మంచిదని చెబుతారు. ఒకే ప్రదేశంలో అనేక గణపతి విగ్రహాలను ఉంచకుండా.. పూజకు అనువైన ప్రశాంతమైన ప్రదేశంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని భావిస్తారు. అలాగే మట్టి లేదా సహజ పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలకు సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
  7. గణపతి విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి?: విశ్వాసాల ప్రకారం గణపతి విగ్రహ ప్రతిష్ఠకు మధ్యాహ్న సమయం అనుకూలంగా భావిస్తారు. ప్రతిష్ఠ సమయంలో పూజా విధానంలో భాగంగా కలశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కలశంలో మామిడి ఆకులు లేదా తమలపాకులు ఉంచి.. పైన కొబ్బరికాయను ఏర్పాటు చేసి, కుంకుమతో అలంకరించాలి. చౌరంగం(పీటం)పై పసుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించవచ్చు. అనంతరం గణపతికి షోడశోపచార పూజ లేదా తమ సంప్రదాయం ప్రకారం పూజ నిర్వహించాలి.
  8. ప్రతిరోజూ దీపారాధన చేయాలి: గణపతి బప్పా కార్యాలయంలో కొలువై ఉన్నన్ని రోజులు ఉదయం, సాయంత్రం నెయ్యితో దీపం వెలిగించి గణపతిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. గణపతి స్తోత్రాలు, మంత్రాలు, సంకటనాశన గణేశ స్తోత్రం వంటి వాటిని పఠించవచ్చు. అనంతరం హారతి ఇవ్వడం ద్వారా పూజను ముగించవచ్చు. ఇలా భక్తిశ్రద్ధలతో గణపతిని ఆరాధించడం వల్ల కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొని, విఘ్నాలు తొలగి విజయం, శ్రేయస్సు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

(Disclaimer: ఈ కథనంలోని అంశాలు వాస్తు, మతపరమైన సంప్రదాయాలు, విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us