
అయితే చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు మాత్రమే కాకుండా ఆయన డబ్బు గురించి కూడా చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆయన ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు 15 సంవత్సరాల లోపు నేర్పాల్సిన మనీ సూత్రాల గురించి గొప్పగా తెలియజేయడం జరిగింది. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

చాలా మంది తమ పిల్లలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో నేర్పించాలి. కొందరు ఏటీఎం నుంచే వస్తుంది కదా అనుకుంటారు. కానీ తాను మనీ తీసుకునే ముందు అది ఎంత కష్టపడితే వస్తుంది అనేది వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. దాని వలన వారు డబ్బు ఖర్చు పెట్టడానికి ముందు ఆలోచిస్తారు. అంతే కాకుండా వారికి శ్రమ విలువ తెలుస్తుంది.

అవసరం, కోరిక : ఈ రెండింటి మధ్య తేడాను కూడా మీ పిల్లలకు మీరు తెలియజేయాలి. అన్నం, బట్టలు, చదువు, ఇల్లు ఇవి అవసరాలు. కొత్త కొత్త బొమ్మలు, చాక్లెట్స్ ఇవి కోరికలు. మీ దగ్గర మనీ ఉన్నప్పుడు వీటిని కొనడం అవసరమా అనేది ఆలోచించడం వలన మీరు ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారు.

ముఖ్యమైనది డబ్బును పొదుపు చేయడం. మీరు మీ పిల్లలకు డబ్బును పొదుపు చేయడం గురించి సరైన విధంగా తెలియజేయాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి, మంచి రోజులు ఉన్నప్పుడు కొంత దాచుకుంటే, చెడు సమయంలో అవి ఉపయోగపడతాయి. కాబట్టి, కొంత ఖర్చుపెట్టుకోవడాని, ఒకటి ఇతరులకు సహాయం చేయడానికి, మరి కొంత దాచుకోవడానికి అంటూ ఇలా లెక్కలు రాయడం నేర్పిస్తే వారు చిన్నప్పటి నుంచే బడ్జెట్ వేయడం నేర్చుకుంటారు.

అంతే కాకుండా ఖర్చు చేసే విధానంలో కూడా తెలివిని చూపించడం నేర్పించాలి. ఒక వస్తువు కొనే ముందు ధరలను పోల్చడం, నాణ్యత చూడటం, నిజంగా దానికి అంత విలువ ఉందా లేదా. దానిని కొనడం ఇప్పుడు తప్పనిసరినా ఇలా ప్రతీది అంచనా వేసుకొని ఖర్చు చేయడం వలన డబ్బు విలువ తెలుస్తుంది. అలాగే అనుభవం కూడా రానివ్వండి,పిల్లవాడు తన పాకెట్ మనీ మొత్తం ఒకేసారి ఖర్చు చేసి తర్వాత బాధపడితే, తిట్టకండి. ఆ చిన్న తప్పు నుండే వాడు పెద్ద పాఠం నేర్చుకుంటాడు. 5 రూపాయలతో చేసే తప్పు, రేపు 5000 రూపాయలతో చేయకుండా కాపాడుతుంది.