ఆచార్య విషయాలు వెల్లడిస్తున్న సోనూసూద్.. మెగాస్టార్‌ చిరంజీవితో ఎన్నిసార్లు నటించినా కొత్తగా ఉంటుందని ప్రకటన..

లాక్‌డౌన్ కాలంలో ఎంతో మంది కార్మికులకు అండగా నిలిచిన మహనీయుడు. తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి అందరినీ గ్రామాలకు తరలించిన కృషివలుడు. విదేశాలలో చిక్కుకున్న వారికి తాను ఉన్నానని భరోసానిచ్చిన ఆదర్శ ప్రాయుడు.

  • uppula Raju
  • Publish Date - 10:30 am, Sat, 28 November 20

లాక్‌డౌన్ కాలంలో ఎంతో మంది కార్మికులకు అండగా నిలిచిన మహనీయుడు. తన సొంత డబ్బులు ఖర్చుపెట్టి అందరినీ గ్రామాలకు తరలించిన కృషివలుడు. విదేశాలలో చిక్కుకున్న వారికి తాను ఉన్నానని భరోసానిచ్చిన ఆదర్శ ప్రాయుడు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్థికసాయం అందించిన ధీరోదాత్తుడు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారికి జాబ్ పోర్టల్ ప్రారంభించి ఉద్యోగాలు కల్పిస్తున్న కలియుగ దేవుడు మన సోనూసూద్.

కోట్ల రూపాయాలు ఖర్చుచేసి అభాగ్యులకు సేవ చేస్తున్నాడు. దేశంలో ఎంతో మంది సెలబ్రిటీలు, ధనవంతులున్నా ఎవరూ చేయని సాహసం చేసి అందరి అభిమానాలను చూరగొంటున్నాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఎత్తేయడం వల్ల సోనూ మళ్లీ సినిమాలపై మళ్లాడు. లాక్‌డౌన్ వల్ల తాను నటించే ఆగిపోయిన సినిమాలన్నింటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు. అంతేకాకుండా తెలుగు ప్రేక్షకులకు ఇటీవల ఓ గుడ్ న్యూస్ కూడా చెప్పాడు. టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి నటించే ఆచార్య సినిమాలో నటిస్తున్నానని ప్రకటించాడు. ప్రస్తుతం అందులో తన క్యారెక్టర్ గురించి కూడా కొన్ని విషయాలు వెల్లడించాడు. చిరంజీవితో ఎన్నిసార్లు నటించినా ప్రతిసారి ఓ కొత్త అనుభూతి కలుగుతుందని అన్నాడు. ఆయన చాలా పరిణితి చెందిన నటుడిగా కొనియాడారు. అంతేకాకుండా ఆచార్యలో తన లుక్ డిప్రెంట్‌గా, కొత్తగా కోణంలో ఉంటుందని ప్రకటించారు. అయితే సోనూసూద్ విలనిజం పండించటంలో మేటి. ఒక రకమైన ఒరవడితో, పదజాలంతో అధ్భుతంగా నటిస్తాడు. అయితే ఆచార్యలో ఎటువంటి విలనిజం పండించాడో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే..