మీరు లేని లోటు భర్తీ చేయలేనిది, సన్నిహితుడిని కోల్పోయాం, అహ్మద్ పటేల్ మృతిపై సోనియా గాంధీ

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు.  ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 1:57 pm, Wed, 25 November 20
మీరు లేని లోటు భర్తీ చేయలేనిది, సన్నిహితుడిని కోల్పోయాం,  అహ్మద్ పటేల్ మృతిపై సోనియా గాంధీ

కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ మృతిపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర సంతాపం తెలిపారు.  ఆయన లేని లోటు భర్తీ చేయలేనిదన్నారు. ఒక విశ్వాస పాత్రుడైన స్నేహితుడిని, సన్నిహితుడిని కోల్పోయామన్నారు. ఏళ్ళ తరబడి తనకు రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించిన పటేల్ మృతి పార్టీకి తీవ్ర ఆవేదనను మిగిల్చిందని ఆమె పేర్కొన్నారు. జీవితాంతం ఆయన పార్టీకి ఎనలేని సేవలు అందించారని సోనియా అన్నారు.

ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం:

అహ్మద్ పటేల్ కన్నుమూత కాంగ్రెస్ పార్టీకి ఎనలేని లోటని ప్రధాని మోదీ తన ట్విటర్ లో పేర్కొన్నారు. దేశానికి, సమాజానికి పటేల్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.  ఆయన కుమారుడు ఫైసల్ కు, ఆయన కుటుంబానికి తన సంతాపాన్ని తెలియజేసినట్టు మోదీ తెలిపారు.  కాగా అహ్మద్ పటేల్ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ లో వివిధ హోదాల్లో పని చేశారు. క్లిష్ట సమయాల్లో సోనియాకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ వచ్చారు.