బుసలు కొడుతున్న విషసర్పాలు..ఒకేరోజు ఆరుగురికి పాముకాటు

ఏపీలో మళ్లీ విషసర్పాలు బుసలు కొడుతున్నాయి. వర్షాలు పడుతుండటంతో పొదల్లోంచి పాములు జనవాసాలు, పంటపొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తున్న విషసర్పాలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా

బుసలు కొడుతున్న విషసర్పాలు..ఒకేరోజు ఆరుగురికి పాముకాటు
Follow us

|

Updated on: Jul 16, 2020 | 12:35 PM

ఏపీలో మళ్లీ విషసర్పాలు బుసలు కొడుతున్నాయి. వర్షాలు పడుతుండటంతో పొదల్లోంచి పాములు జనవాసాలు, పంటపొలాల్లోకి వచ్చి చేరుతున్నాయి. విచ్చలవిడిగా సంచరిస్తున్న విషసర్పాలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పాములు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పామర్రు నియోజకవర్గంలో రైతులు పాముకాటుకు గురవుతున్నారు.

కృష్ణా జిల్లాలో పాముల సంచారంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ, పమిడిముక్కల మండలాల్లో ఒకే రోజు ఆరుగురు వ్య‌వ‌సాయ కూలీలను పాములు కాటు వేశాయి. స్థానికులు వెంట‌నే వారిని ఆస్పత్రికి త‌ర‌లించ‌గా ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉందని వైద్యులు తెలిపారు. పాములు కాటు వేస్తుండటంతో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇకపోతే, వర్షాకాలం కావడంతో పాములు పొలాల్లోకి వస్తున్నాయని, వ్యవసాయ పనులు చేసే రైతుఉల, కూలీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.